Ariyana : అరియానా క్రేజ్ మామూలుగా లేదు.. ఇదే నిదర్శనం! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ariyana : అరియానా క్రేజ్ మామూలుగా లేదు.. ఇదే నిదర్శనం!

 Authored By bkalyan | The Telugu News | Updated on :11 February 2021,5:30 pm

Ariyana : బిగ్ బాస్ షో నాల్గో సీజన్‌లో అరియానాది కాస్త డిఫరెంట్ క్యారెక్టర్. ఏదో ఒకటి చేసి అందరి దృష్టిని తిప్పుకోవాలి.. ఫేమస్ అవ్వాలి.. తప్పో ఒప్పో చేసి జనాలను ఆకట్టుకోవాలనే ఆత్రుతతో ఉండేది. మొదట్లో అరియానా వ్యక్తిత్వాన్ని అందరూ తప్పు పట్టినా, ఆమె అతిపై అందరూ చిరాకు పడినా కూడా చివరి వరకు ఆమె పోరాడిన విధానాన్ని చూసి అందరూ ఫిదా అయ్యారు. చివరకు అరియానాను ఓ రేంజ్‌లో కూర్చోబెట్టారు. ఇక చివరి వారంలో అరియానా ఆ కాస్త అతి చేయకుండా ఉండుంటే ఇంకా మంచి స్థానంలో నిలబడేది.

సోహెల్‌తో జరిగిన గొడవలో అరియానా ప్రదర్శించిన తీరుకు నెగెటివిటీ ఏర్పడింది. అలా ఆమెకు కాస్త తక్కువ ఓట్లు వచ్చాయి. మామూలుగా అయితే అరియానా టాప్ 3, 2లో ఉండాల్సింది. కానీ ఆ గొడవల వల్ల, అలా కిందపడి దొర్లుతూ ఏడ్వడం, సోహెల్‌ను బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతోనే అంత రాద్దాంతం చేసినట్టు అందరూ ఫీల్ అయ్యారు. అలా చివరకు అరియానా నాల్గో స్థానంలో ఉండిపోయింది.

Ariyana is princess of Bigg Boss 4 telugu

Ariyana is princess of Bigg Boss 4 telugu

బిగ్ బాస్ ప్రిన్సెస్ : Ariyana

అయితే అరియానాకు బిగ్ బాస్ టీం కూడా బాగానే సపోర్ట్ చేసినట్టుంది. అందుకే టాస్కుల్లో కూడా ఆమెకు రాజకుమారి వేషాలే ఇచ్చారు. బిగ్ బాస్ ప్రిన్సెస్ అంటూ ఆమెను బాగా బుజ్జగించారు. అలా ఇప్పుడు గూగుల్ తల్లి కూడా ఫిక్స్ అయింది. బిగ్ బాస్ తెలుగులో ప్రిన్సెస్ ఎవరని అడిగితే అరియానాను చూపిస్తోంది. అలా గూగుల్ తల్లి కూడా చూపించడంతో అరియానా ఫ్యాన్స్ ఎక్కడా ఆగడం లేదు.

 

Advertisement
WhatsApp Group Join Now

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది