Sreemukhi : బుల్లెట్ బండి పాట.. అవినాష్‌తో రెచ్చిపోయి శ్రీముఖి.. వామ్మో ఊపేస్తున్నారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreemukhi : బుల్లెట్ బండి పాట.. అవినాష్‌తో రెచ్చిపోయి శ్రీముఖి.. వామ్మో ఊపేస్తున్నారు

 Authored By aruna | The Telugu News | Updated on :3 August 2022,3:40 pm

Sreemukhi : బుల్లితెరపై శ్రీముఖి, అవినాష్‌ల సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మామూలుగానే ఈ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లోనూ ఈ ఇద్దరూ దుమ్ములేపుతుంటారు. ఇక వీరిద్దరి స్నేహం గురించి అందరికీ తెలిసిందే. కష్టకాలంలో అవినాష్‌ను శ్రీముఖి ఆదుకుంది. బిగ్ బాస్ ఇంట్లో అవినాష్ వెళ్లేందుకు, మల్లెమాల అగ్రిమెంట్ ప్రకారం పదిలక్షలు చెల్లించడంలో శ్రీముఖి సాయమే ఉంది. పది లక్షలు శ్రీముఖి ఇవ్వడంతోనే బిగ్ బాస్ ఇంట్లోకి అవినాష్ అడుగు పెట్టగలిగాడు. ఇక అవినాష్ పెళ్లిలోనూ శ్రీముఖిదే హవా. అవినాష్ పెళ్లి కోసం శ్రీముఖి ముందుండి పనులన్నీ చేసింది.

ప్రీ వెడ్డింగ్ షూటింగ్, పెళ్లి, రిసెప్షన్ ఇలా అన్ని పనుల్లోనూ శ్రీముఖి హడావిడి కనిపించింది. అంతలా ఈ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. శ్రీముఖి చేసిన సాయం వల్లే ఈ రోజు ఇక్కడ ఉన్నాను, ఈ స్థాయిలో ఉన్నాను అంటూ అవినాష్ ఎప్పుడూ చెబుతుంటాడు. కామెడీ స్టార్స్ షోలోనూ ఈ విషయాలన్ని స్కిట్ రూపంలోనూ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి స్టార్ మాలో షోలు చేస్తున్నారు. శ్రీముఖి రీల్ వీడియోలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అందులో ఆమె వేసే డ్యాన్సులు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అప్పట్లో ఓ రూంలో శేఖర్ మాస్టర్‌తో కలిసి బుల్లి నిక్కర్లో శ్రీముఖి వేసిన చిందులు నానా రకాలుగా ట్రెండ్ అయింది. ఆ వీడియోపై ఎక్కువగా ట్రోలింగ్ కూడా నడిచింది.

Avinash And Sreemukhi Bullet Bandi Song Reel

Avinash And Sreemukhi Bullet Bandi Song Reel

ఇదే విషయంపై స్కిట్లో సైటర్ వేస్తే.. ఇంట్లోకి వెళ్లాక నాకు మూడింది అంటూ శేఖర్ మాస్టర్ సీక్రెట్ బయటపెట్టేశాడు. అంటే దాని ఎఫెక్ట్ ఇంట్లోనూ పడిందన్న మాట. అలా శ్రీముఖి రీల్ వీడియోలు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇక తాజాగా బుల్లెట్ బండి అందరూ ఊపేస్తున్నారు. ది వారియర్ సినిమాలో రామ్, కృతి శెట్టి వేసిన స్టెప్పులను అందరూ వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రీల్ వీడియోను శ్రీముఖి, అవినాస్ వేశారు. పల్సర్ బైక్ తీసుకురా మావా అంటూ శ్రీముఖి ఈ రీల్ వీడియోను షేర్ చేసింది. అందులో శ్రీముఖి తెగ ఊపేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది