Baby Movie : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా చూసిన ‘ బేబీ ‘ సినిమా పేరే వినిపిస్తుంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేస్తుంది. అత్యధిక వసూళ్లను రాబడుతూ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ ఇండస్ట్రీలోని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఈమధ్య వచ్చిన సినిమాలన్నీ రెండు వారాలకు మించి ఎక్కువ ఆడడం లేదు అది కూడా వీక్ డేస్ లోనే ఆడతాయి. అలాంటిది బేబీ సినిమా వీకెండ్ డేస్ తో పాటు వర్కింగ్ డేస్ లో కూడా దుమ్ము రేపుతుంది.
మొదటిరోజు బేబీ సినిమా ఎన్ని కలెక్షన్స్ సాధించిందో ఆరవ రోజు కూడా అంతే కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. ఈ రేంజ్ లో కలెక్షన్స్ స్టార్ హీరోల సినిమాలకు కూడా రావు. అలాంటిది చిన్న సినిమా ఆ ఫిట్ ను అందుకుంది అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇకపోతే ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణలో కలిపి దాదాపుగా రెండు కోట్లకు పైగా వసూళ్లను సాధించిందట. అలా ఆరు రోజులకు ఈ సినిమా 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించిందట. ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల వరకు వసూళ్లను సాధించింది.

ఈనెల 28వ తారీఖున విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ బ్రో సినిమా తప్ప మరేమీ సినిమాలు ఇప్పట్లో విడుదలకు సిద్ధంగా లేవు. కాబట్టి ఈ సినిమా 30 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఏది ఏమైనా చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టడం అద్భుతం అని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. లవ్ స్టోరీ కావడంతో ఈ సినిమాకి యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. సినిమా స్టోరీ కూడా బాగుండడంతో మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాను సాయి రాజేష్ దర్శకత్వం వహించారు.