Acharya Movie : మెగా అభిమానులకు మరోసారి బ్యాడ్ న్యూస్.. ఆచార్య సినిమా వాయిదా..?
Acharya Movie : రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. గతంలో కరోనా మహమ్మారి వలన మూతబడి తిరిగి తెరచుకున్న థియేటర్లకు ఇప్పుడిప్పుడే జనాలు రావడం మొదలెట్టారు. తీరా థర్డ్ వేవ్ రూపంలో మరోసారి కరోనా పంజా విసిరేందుకు సిద్ధమైంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంక్షలు అమలు చేసేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఈ దెబ్బతో తెలుగు చిత్ర పరిశ్రమను మరోసారి కారు చీకట్లు కమ్ముకోనున్నట్టు ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచిన రెండు పాన్ ఇండియన్ సినిమాలు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వాయిదా పడ్డాయి. అయితే, ఈ జాబితాలోకి తాజాగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా కూడా వాయిదా పడనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాను ఫిబ్రవరి -4న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.2021 ఏడాది చివరలో పెద్ద సినిమాలు అఖండ, పుష్ప ది రైజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. మళ్లీ కలెక్షన్లు రాబట్టాయి. జనాలు కూడా థియేటర్లకు రావడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే మరోసారి కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే పండుగ తర్వాత రెండు రాష్ట్రాల్లో ఆంక్షలు తప్పనిసరి అని ప్రభుత్వ వర్గాల నుంచి లీకులు వినిపిస్తున్నాయి. థియేటర్లను పూర్తిగా మూసివేయడమా..? లేదా 50 శాతం ఆక్సుపెన్సీతో నడిపిస్తారా? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.ఇకపోతే 2022లో బాక్సాఫీసును షేక్ చేస్తుందనుకున్న ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ మూవీస్ వాయిదా పడటంతో తండ్రి కొడుకులు కలిసి నటించిన ఆచార్య మూవీ కూడా వాయిదా వేసేందుకు చిత్ర బృందం ఆలోచిస్తుందని టాక్..
Acharya Movie : ఆచార్య నిజంగానే వాయిదా పడనుందా..?
కొవిడ్ టైంలో రిలీజ్ చేస్తే కలెక్షన్లపై అది తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ఏపీలో టికెట్ల రేట్లు కూడా తక్కువగా ఉండటంతో ఎక్కువరోజులు నడిస్తేనే గానీ సినిమాకు వసూళ్లు అంతగా రావు..ఇక ఆచార్య సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్స్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఆలయ భూములు ఆక్రమణపై చిరు ఏ విధంగా పోరాటం సాగించారనేదానిపై ఆచార్య సినిమా నడుస్తుందట.. ఇందులో చిరు, చెర్రీలు మావోయిస్టులుగా కనిపించనున్నారు. సోనూ సూద్ విలన్. చిరు జోడిగా కాజల్ అగర్వాల్.. చరణ్ జోడిగా పూజా హెగ్డే యాక్ట్ చేయగా, మణిశర్మ బాణీలు సమకూర్చారు.