Acharya Movie : ఆచార్య నష్టాలతో ఆస్తులని అమ్ముకున్న కొరటాల శివ
Acharya : మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య అనే సినిమాని తెరకెక్కించాడు కొరటాల శివ. ఈ చిత్రానికి ముందు ఒక్క అపజయం కూడా లేకుండా వరుస హిట్స్ అందుకున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్ గా మారింది ఆచార్య. మెగా అభిమానులు సైతం ఈ సినిమా పై నెగిటివ్ కామెంట్లు చేశారు. దీంతో చిత్ర డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలు వాటిల్లాయి. ఈ నేపథ్యంలో చిత్ర డైరెక్టర్ కొరటాల శివ తన వంతు బాధ్యతగా డిస్ట్రిబ్యూటర్లకు ఫైనల్ సెటిల్మెంట్ ఆఫర్ చేశారట. ఫైనల్ సెటిల్మెంట్ లో భాగంగా కొరటాల శివ డిస్ట్రిబ్యూటర్లకు 33 కోట్లు తిరిగి ఇచ్చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఈ మూవీ కారణంగా కొరటాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఆచార్య చిత్రాన్ని నిర్మించాయి. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందట. ఆలస్యం కావడంతో మేకర్స్ మధ్యలో వదిలి వెళ్ళిపోయారట. దీంతో కొరటాల నిర్మాణ బాగస్వామిగా ఉండి ఆచార్య తెరకెక్కించారట. అట్టర్ ప్లాప్ కారణంగా భారీగా నష్టాలు వచ్చాయి. బయ్యర్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తం కోసం కొరటాల ఓ ప్రాపర్టీ అమ్మేశారట. రూ. 15 కోట్లు చెల్లించాల్సి ఉండగా… కొరటాల ఈ చర్యకు పాల్పడ్డారన్న వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉంది. దీనితో ఆచార్య ఫెయిల్యూర్ బాధ్యత కొరటాల తీసుకున్నట్లు అయ్యింది.
Acharya Movie : చాలా బెడిసి కొట్టింది..
2013లో విడుదలైన మిర్చి మూవీతో దర్శకుడిగా మారారు. మిర్చి బ్లాక్ బస్టర్ హిట్ కాగా… రెండో చిత్రం శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్ అందుకుంది. దీంతో కొరటాల స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరారు. ఎన్టీఆర్ తో చేసిన జనతా గ్యారేజ్, మహేష్ తో చేసిన రెండో చిత్రం భరత్ అనే నేను వరుస విజయాలు అందుకున్నాయి. ఓటమి లేని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొరటాల రికార్డులకు ఎక్కాడు. అయితే ఆచార్యతో ఆయన ఫేమ్ మొత్తం పోయింది. ఈ సినిమాను రిలీజ్‌కు ముందే 120 కోట్లకు బిజినెస్ చేశారు. అయితే ఈ సినిమా దాదాపు 40 కోట్ల వరకు రాబట్టింది. అయితే డిస్టిబ్యూటర్లకు వాటిల్లిన నష్టాన్ని పూడ్చేందుకు దాదాపు 80 కోట్ల వరకు వెనక్కి ఇచ్చివేసినట్టు సమాచారం.