Bhagavanth Kesari Public Talk : బాలయ్య వేట మొదలైంది.. ఎవడ్రా చిరంజీవి.. కేసీపీడీ అనుకుంటే దాని అమ్మ మొగుడు సినిమా భయ్యా ఇది
Bhagavanth Kesari Public Talk : నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై దూసుకుపోతోంది. థియేటర్ల వద్ద ఎక్కడ చూసినా బాలయ్య ఫ్యాన్స్ హంగామా నడుస్తోంది. థియేటర్ల వద్ద జాతర కనిపిస్తోంది. బాలయ్య బాబు సినిమా అంటే మామూలుగా ఉండదు కదా. బాలయ్య బాబు సినిమా చూసి జనాలకు పిచ్చెక్కిపోయింది. సినిమా మామూలుగా లేదంటూ అభిమానులు హడావుడి చేస్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్ కు మంచి పండుగ లాంటి సినిమా అది. పబ్లిక్ టాక్ చూస్తే మామూలుగా లేదు. రచ్చ రచ్చ చేశారు. అసలు బాలయ్య బాబులో మరో కోణాన్ని చూస్తారు. సినిమా మాత్రం అదిరిపోయింది. ఇప్పటి వరకు బాలకృష్ణ నటించిన సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా మరో ఎత్తు అని అభిమానులు అంటున్నారు.
బాలకృష్ణ ఈసారి కామెడీ కూడా పండించారు. ఫైట్ సీన్స్ కూడా అంతకుమించి అనేలా ఉన్నాయి. లేడీస్ కు మంచి మెసేజ్ ఇచ్చారు. మహిళల గురించి మంచి మెసేజ్ అని చెప్పుకోవచ్చు. అన్ని విధాలా బాగుంది. మంచిగా ఎంజాయ్ చేస్తారు. బాలయ్య యాక్టింగ్ ఇరగదీశాడు. 500 కోట్లు పక్కా అంటూ చెప్పుకొచ్చారు. భగవంత్ కేసరి మూవీపై ఇన్ని అంచనాలు పెట్టుకోలేదు. అనిల్ రావిపూడి సినిమా అంటే మామూలుగా ఉండదు. కానీ.. ఈ సినిమా అనిల్ రావిపూడి సినిమాలా లేదు. బాలకృష్ణ, శ్రీలీల.. ఈ ఇద్దరూ ఇరగదీశారు. రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. మంచి మెసేజ్ ఇచ్చే సినిమా ఇది.. అని చెప్పుకొచ్చారు.

balakrishna bhagavanth kesari movie public talk
Bhagavanth Kesari Public Talk : కమర్షియల్, మెసేజ్ రెండింటినీ బాగా కవర్ చేశారు
భగవంత్ కేసరి సినిమా బ్లాక్ బస్టర్. అనిల్ రావిపూడి దర్శకత్వం అదిరిపోయింది. ఒక ఆడపిల్లను ఎలా సింహంలా పెంచాలో ఈ సినిమాలో చూపించారు. మహిళలు కూడా ఏదైనా సాధించగలరు అని చెప్పే మూవీ ఇది. ఇలాంటి సినిమా తీయడం కూడా చాలా హైలెట్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్. కమర్షియల్, మెసేజ్ రెండింటినీ అద్భుతంగా కవర్ చేశారు. బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ చూస్తే అదిరిపోయింది. ప్రతి హీరో ఫ్యాన్ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఒక ఆడపిల్ల ఎలా ఈ సమాజంలో ఎంత అద్భుతంగా రాణించగలదో చెప్పుకొచ్చారు.. అంటూ పబ్లిక్ సినిమాను ఆకాశానికెత్తారు.
