Bandala Ganesh : టపాసులకి 4లక్షలు ఖర్చు చేసిన బండ్ల గణేష్.. ఊరు మొత్తానికి కొన్నాడా ఏమి?… వీడియో
Bandala Ganesh : బండ్ల గణేష్ ఏ పని చేసిన దానిలో కొంత ప్రత్యేకత ఉంటుంది. పవన్ కళ్యాణ్ గురించి బండ్ల గణేష్‌ని మాట్లాడమంటే ఆయన అనర్గళంగా మాట్లాడతాడు. ఇక ఆ మధ్య డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్టన్నింగ్ కామెంట్స్ చేయడం చర్చకు తెరలేపింది. పూరి భార్యను లావణ్య పొగుడుతూ ర్యాంపులు, వ్యాంపులు వస్తారు పోతారు అంటూ బండ్లన్న చేసిన కామెంట్స్‌లో పలు అర్థాలు వెతికారు ఆడియన్స్.కన్న కొడుకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుని ముంబైలో ఏం చేస్తున్నావ్ అన్నా అంటూ బండ్ల గణేష్ రియాక్ట్ అయిన తీరు పెద్ద ఇష్యూ అయింది. దీనిపై పరోక్షంగా పూరి జగన్నాథ్ కౌంటర్ ఇవ్వడం పలు చర్చలకు తావిచ్చింది.
ఎవ్వరైనా సరే నోరు దగ్గరపెట్టుకుంటే మంచింది అంటూ పూరి మ్యూజింగ్స్ లో చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. అంతకముందు .. భీమ్లా నాయక్ ఈవెంట్ విషయంలో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. త్రివిక్రమ్ గాడు నన్ను రానివ్వకుండా చేయాలని చూస్తున్నాడు.. వైసీపీవారితో కుమ్మక్కయ్యాడు.. అని బదులివ్వగా.. పిలవకపోయినా వెళ్లొచ్చుగా అని ఎదురు వ్యక్తి ప్రశ్నిస్తాడు. పిలవకుండా వెళితే బాగోదని, వాడు డౌనవుతాడని నన్ను రావొద్దన్నాడంట.. అదే ఆలోచిస్తున్నాను అంటాడు. ఈ తరహా వ్యాఖ్యలతో బండ్ల గణేష్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక దీపావళికి బండ్ల గణేష్ ఏకంగా నాలుగు లక్షల పైనే ఖర్చుపెట్టి దీపావళికి టపాసులు కొనేశారు. దీంతో ఈ విషయం విన్నవారు ముక్కునే వేలేసుకుంటున్నారు.

Bandala Ganesh invest 4 lakhs for crackers
Bandala Ganesh : ఏందది..
రెగ్యులర్ గా …బండ్ల గణేష్ ప్రతీ దీపావళికి టపాసులు కొంటాడు. వాటిని ఇంటి ముందున్న వరండాలో పేర్చుతాడు. వాటిని ముందు నిల్చుని అలా ఫోటో దిగుతాడు. ఆ ఫొటో చూసిన వారు ఊరంతా సరిపోయే టపాసులను కొంటాడా? అని అందరికీ అనుమానం వస్తూంటుంది. గత రెండేళ్ల నుంచి బండ్ల గణేష్ ఇలానే చేస్తూ ఉన్నాడు. తాజాగా ఈ ఏడాదికి సంబంధించిన ,వీడియో కూడా షేర్ చేశాడు. నాలుగు లక్షల విలువైన టపాసులను కొనేశాడట బండ్లన్న. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు నోరెళ్లబెట్టేశారు. ఈ ట్వీట్ చూసిన వాళ్లు ఊరంతా పంచడానికి కొన్నారా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక నిర్మాతగా బండ్ల గణేష్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్లున్నాయి. ఇప్పుడు సినిమాలకు కాస్త దూరంగా ఉన్నాడు.
₹4,02,340 Bandlanna Mass ???????? pic.twitter.com/lPZmOfOEbh
— Sarcastc_Tweets (@Sarcastc_Tweets) October 24, 2022