Bigg Boss Inaya : కన్ఫెషన్ రూం కి పిలిచి ఇనయాని ఏడ్చేలా చేసిన బిగ్ బాస్.. హౌస్ మెట్స్ మాత్రం తెగ ఎంజాయ్ చేశారు..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: December 9, 2022, 2:00 pm

Bigg Boss Inaya : బిగ్ బాస్ హౌస్ లో 13వ వారం తాము అంతకుముందు త్యాగం చేసిన విన్నర్ ఎమౌంట్ ని మళ్లీ తిరిగి సంపాదించేందుకు టాస్క్ లను పెడుతున్నాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఇద్దరికి టాస్క్ ఇచ్చి మిగతా వారిని ఎవరు గెలుస్తారో గెస్ చేస్తే.. వీరి గెస్ చేసిన వారు గెలిస్తే కొంత మొత్తం విన్నింగ్ ఎమౌంట్ లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇలా ఐదు రౌండ్ల దాకా బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. వాటిలో ఒకటి ఓడిపోగా మిగతావి అన్ని గెస్సింగ్ కరెక్టే అయ్యింది.

ఇక ఇప్పుడు హౌస్ మెట్స్ ని భయపెట్టే టాస్క్ తో బిజీగా ఉన్నాడు బిగ్ బాస్. ఆదిరెడ్డిని కన్ ఫెషన్ రూం కి రమ్మని అందులో దెయ్యాల సెటప్ చేసి. రకరకాల సౌండ్స్ తో భయపెట్టించారు. అంతేకాదు అతనికి తోడుగా శ్రీహాన్ ని కూడా కన్ ఫెషన్ రూం లోకి వెళ్లమంటాడు బిగ్ బాస్. వాళ్లిద్దరు చేసిన కామెడీ అదిరిపోయింది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో శ్రీ సత్యని బిగ్ బాస్ కన్ఫెషన్ రూం లోకి పిలవగా ఆమె ఎన్నిసార్లు చెప్పినా భయం భయమని చెప్పడంతో ఆమె ద్వారా వచ్చే మొత్తాన్ని బిగ్ బాస్ వెనక్కి తీసుకున్నారు.

Bigg Boss 6 Telugu Bad News to inaya and cried

Bigg Boss 6 Telugu Bad News to inaya and cried

ఈరోజు ఇనయా కూడా కన్ఫెషన్ రూం లో వెళ్తుంది. అక్కడ ఆమెని భయపెట్టేందుకు బిగ్ బాస్ నిజంగానే తెల్ల బట్టలతో కనిపించే సరికి మరింతగా భయపడ్డది. ఫైనల్ గా టాస్క్ కోసం ముందు డేరింగ్ గా కన్ఫెషన్ రూం లోకి వెళ్లిన ఇనయాని బాగా భయపెట్టించాడు బిగ్ బాస్. ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలో ఎక్సయిట్ అనిపించగా ఈ టాస్క్ తో ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ అయ్యేలా చేస్తున్నారని చెప్పొచ్చు. ఇదివరకు సీజన్లలో దెయ్య టాస్క్ చాలా ఫన్నీగా అనిపించగా ఈ సీజన్ కూడా ఆ విషయంలో సక్సెస్ చేశారు బిగ్ బాస్.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp