Bigg Boss 8 Telugu : ఇదెక్కడి ట్విస్ట్.. సోనియా, నాగార్జున మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్… ?
Bigg Boss 8 Telugu : బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు బిగ్ బాస్. గత ఏడు సంవత్సరాలుగా ఈ షో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది. ఇందులో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ లో ఒకరు సోనియా ఆకుల. ఈ అమ్మడు టాలీవుడ్ హీరోయిన్. 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ మూవీలో సోనియా తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను […]
Bigg Boss 8 Telugu : బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు బిగ్ బాస్. గత ఏడు సంవత్సరాలుగా ఈ షో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది. ఇందులో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ లో ఒకరు సోనియా ఆకుల. ఈ అమ్మడు టాలీవుడ్ హీరోయిన్. 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ మూవీలో సోనియా తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత ఆర్జీవీ దర్శకత్వం వహించిన కరోనా వైరస్, ఆశ ఎన్‌కౌంటర్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బిగ్ బాస్‌లో తన ఆటతీరులో బీబీ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపిస్తోంది సోనియా. అయితే.. మొదట్లో నిఖిల్ తో చనువుగా ఉండటం, ఆ తరువాత పృధ్వీతో సన్నిహితంగా వ్యవహరించడంతో ఆమెపై ట్రోలింగ నడుస్తుంది.
Bigg Boss 8 Telugu ఎందుకంత సపోర్ట్
ఈ క్రమంలో సోనియా పేరెంట్స్ స్పందించారు.తాను అందరితో స్నేహంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్బంలో సోనియా లవ్ ఎఫైర్ గురించి ప్రశ్నించగా.. సోనియా తల్లి సమాధానమిస్తూ.. ‘ తనకు ఎలాంటి లవ్ ఎఫైర్ లేవు. అల్రెడీ మ్యారేజ్ సెట్ అయ్యింది. డిసెంబర్ లో మ్యారేజ్ ఉండే.. కానీ, బిగ్ బాస్ లో అవకాశం రావడంతో తనకు కాబోయే అత్తమామ, భార్య అనుమతితోనే తనని హౌస్ లోకి పంపించాం.’ అని తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పుడు అందరిలో సోనియా, నాగార్జున మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందా అనే భావన అందరిలో కలుగుతుంది.రెండో వారం నాగర్జున వచ్చినప్పుడు సోనియాకు రెడ్ కార్డ్ చూపిస్తారేమో అని అంతా అనుకున్నారు. ఎందుకుంటే విష్ణు ప్రియపై ఆమె చేసిన కామెంట్లు అలాంటివి. ఆ వారం అంతా విష్ణును తిడుతూనే ఉంది సోనియా.
ఆట వదిలేసి.. పృథ్వీ.. నిఖిల్ తో కలిసి ఊసుపోని కబర్లు.. కామెంట్లతో… కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లతో గడిపేసింది. అయినా కూడా సోనియాను పల్లెత్తు మాట అనకుండా.. స్వీట్ వార్నింగ్ ఇస్తూ.. బయట నీ గురించి తప్పుగా అనుకుంటారు కాబట్టి ఇంకోసారి అలా చేయకు అని బయట జరిగేది ఆమెకు తెలిసేలా చేశాడు నాగార్జున. దాంతో ఆడియన్స్ లో కూడా డౌట్ స్టార్ట్ అయ్యింది. సోనియాను ఎందుకు కాపాడుతున్నారు అని. ఇక మూడో వారం లో కూడా అంతే.. ఆమె సంచాలక్ గా ఫెయిల్ కాగా, నాగార్జున ఆమె నిర్ణయాన్ని వెనకేసుకుని వచ్చి.. తప్పు మొత్తం ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోబోతున్న అభియ్ మీదకు నెట్టేసి.. బయటకు పంపించేశారు. నాలుగో వారంలో సోనియా రెచ్చిపోతోంది. నామినేషన్స్ లో నోటికొచ్చినట్టు మాట్లాడి.. నభిల్ కు కోపం తెప్పించింది. ఇలా విలన్ షేడ్స్ ఉన్న సోనియాను నాగార్జున, బిగ్ బాస్ ఎందుకు కాపాడుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు.