Bigg Boss Season 6 : బిగ్ బాస్ సీజ‌న్ 6 మ‌రి కొద్ది రోజుల్లో.. లాంచింగ్ ప్రోమో విడుద‌ల‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss Season 6 : బిగ్ బాస్ సీజ‌న్ 6 మ‌రి కొద్ది రోజుల్లో.. లాంచింగ్ ప్రోమో విడుద‌ల‌

 Authored By sandeep | The Telugu News | Updated on :7 June 2022,5:31 pm

Bigg Boss Season 6 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి చ‌క్క‌ని వినోదం పంచుతున్న రియాలిటీ షో బిగ్ బాస్. అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో దూసుకుపోతున్న ఈ షో తెలుగులో ఐదు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇటీవ‌ల ఓటీటీ షో కూడా నిర్వ‌హించ‌గా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మ‌రి కొద్ది రోజుల‌లో బిగ్ బాస్ 6 ప్రారంభం కానుండ‌గా, ఇందులో ప‌లువురు కంటెస్టెంట్స్ పాల్గొన‌నున్నార‌ని, స‌మంత ఈ షోని హోస్ట్ చేయ‌నుందని అనేక వార్త‌లు వ‌చ్చాయి. తాజా ప్రోమోతో ఆ వార్త‌ల‌కు చెక్ ప‌డింది. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి ఈ షోకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సీజన్ 6కు కూడా ఆయనే హోస్ట్‌గా ఉండబోతున్నారు.

ప్రోమోలో నాగార్జున ఎంట్రీ సీన్ చూపించారు. వెయిటింగ్ అయిపోయిందని.. గ్రాండ్ ఓపెనింగ్ అంటూ ప్రోమోను వదిలారు. చాలా గ్రాండ్‌గా సీజ‌న్ 6 ప్లాన్ చేస్తున్నార‌ని, సీజ‌న్ 6కి కూడా నాగార్జున‌నే హోస్ట్ అని తేలిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ 6 హంగామా నడుస్తోంది. పలువురి పేర్లు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యాయంటూ ఓ లిస్ట్ వైరల్ అవుతోంది. పలువురు యూట్యూబర్స్, సోషల్ మీడియాల సెలబ్రిటీలతో టీవీ-సినీ ఆర్టిస్ట్‌లను బిగ్ బాస్ సీజన్ 6 ఎంపిక చేశారంటూ చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో పాల్గొన్న యాంకర్ శివ, ఆర్జే చైతు, మిత్రా శర్మలలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 6లో సందడి చేయనున్నట్లు తెలిసింది.

Bigg Boss Season 6 launching promo released

Bigg Boss Season 6 launching promo released

Bigg Boss 6 : సీజ‌న్ 6 అతి త్వ‌ర‌లో…

న్యూలీ మేరీడ్ మూవీ ఫేమ్ సంజనా చౌదరి, హీరోయిన్, ఆశా సైనీ, యూట్యూబర్ కుషిత కల్లపు, యాంకర్ మంజూష, సింగర్ మోహన భోగరాజు, జబర్దస్త్ వర్ష, సుమన్ టీవీ యాంకర్లు మంజూష, రోషన్, కొరియోగ్రాఫర్ పొప్పి మాస్టర్, సీరియల్ నటి కరుణ భూషన్, వలయం మూవీ ఫేమ్ లక్ష్య్ చదలవాడ, సీరియల్ నటుడు కౌశిక్, యాక్టర్ శ్రీహాన్, మిడిల్ క్లాస్ మెలొడీస్ ఫేమ్ చైతన్య గరికపాటి తదితరుల పేర్లు వైరల్ అవుతున్నాయి. ఈసారి కామన్‌ మ్యాన్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టొచ్చు అంటూ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన విష‌యం తెలిసిందే.

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది