Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఎలిమినేష‌న్.. ఈ వారం హౌజ్ నుండి ఎవ‌రు ఎలిమినేట్ కానున్నారంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఎలిమినేష‌న్.. ఈ వారం హౌజ్ నుండి ఎవ‌రు ఎలిమినేట్ కానున్నారంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :17 November 2024,8:01 pm

ప్రధానాంశాలు:

  •   Bigg Boss Telugu 8 nabeel afridi used his eviction shield to avinash

Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం సక్సెస్ ఫుల్‌గా సాగిపోతుంది. ప్ర‌తి వారం ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ ఆస‌క్తిని క‌లిగిస్తుంది. బిగ్‌ బాస్‌ తెలుగు 8 పదకొండోవారం ఎలిమినేషన్‌కి సంబంధించిన సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దానిపై అంద‌రిలో కాస్త ఎగ్జైట్‌మెంట్ ఉంది. ఈవారం నామినేషన్స్‌లో మొత్తం ఆరుగురు ఉండగా.. వాళ్లలో అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే అవినాష్ వస్తూ వస్తూ నక్క తోకను ఓ పదిసార్లు తొక్కి వచ్చాడో ఏమో కానీ.. ఎలిమినేట్ అయినా కూడా హౌస్‌లోనే కొనసాగబోతున్నాడు.

Bigg Boss Telugu 8 అవినాష్ సేఫ్..

నబీల్ అఫ్రిది రూపంలో మరోసారి అవినాష్‌కి అదృష్టం కలిసి వచ్చింది అని అంటున్నారు. నబీల్ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ ఉంది. దాని సాయంతో తనని తాను సేవ్ చేసుకోవచ్చు. లేదంటే నామినేషన్స్‌లో ఉన్న వాళ్లలో ఒకర్ని సేవ్ చేయొచ్చు. అయితే గత వారం ఎవిక్షన్ షీల్డ్‌ని ఉపయోగించని నబీల్ ఈవారం డేంజర్ జోన్‌లో ఉన్న అవినాష్ కోసం తన ఎవిక్షన్ షీల్డ్‌ని ఉపయోగించి సేవ్ చేసాడు. దీంతో అవినాష్‌ ఎలిమినేషన్ గండం గట్టేక్కేశాడు అవినాష్. దీంతో 11వ వారంలో నో ఎలిమినేషన్ అన్నమాట. అయితే మెగా చీఫ్ అయిన తరువాత మరో వారం నామినేషన్స్‌లోకి రాకుండా అవినాష్ సేవ్ అయ్యాడు. నబీల్ ఎవిక్షన్ షీల్డ్ గెలుచుకోవడంలో సాయం చేసి.. ఇప్పుడు అదే షీల్డ్‌తో మూడోసారి సేవ్ అయ్యాడు.

Bigg Boss Telugu 8 బిగ్ బాస్ ఎలిమినేష‌న్ ఈ వారం హౌజ్ నుండి ఎవ‌రు ఎలిమినేట్ కానున్నారంటే

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఎలిమినేష‌న్.. ఈ వారం హౌజ్ నుండి ఎవ‌రు ఎలిమినేట్ కానున్నారంటే..!

అయితే ఈసారి నామినేషన్స్ నుంచి కాదు.. ఏకంగా ఎలిమినేషన్ నుంచి సేవ్ కావడం విశేషం. అయితే ఈవారం అవినాష్.. బిగ్ బాస్ హౌస్‌కి మెగా చీఫ్‌గా ఉన్నాడు. సో.. ఈవారం కూడా ఇతనికి ఇమ్యునిటీ లభించడంతో నామినేషన్స్‌లోకి రాడు. కాబట్టి.. 13 వారంలోకి అడుగుపెట్టేసినట్టే. అక్కడ కూడా.. రేస్ టు ఫినాలే టాస్క్‌లో మనోడికి లక్ కలిసొస్తే గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టేయడం ఖాయమే.టాస్క్‌ల పరంగా ఎంటర్ టైన్మెంట్ పరంగా అవినాష్ పూర్తి న్యాయం చేస్తున్నాడు. రెండుసార్లు మెగా చీఫ్ అయ్యాడంటే.. అతని ఆటపై గట్టిగానే ఫోకస్ పెడుతున్నాడు. ఏది ఏమైన అవినాష్ ఈ సారి క‌ప్ కొట్టాల‌ని ఆయ‌న ఫ్యాన్స్
చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది