Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ 7 విన్నర్ ఎవరో ఫస్ట్ డేనే తెలిసిపోయింది.. హింట్ ఇచ్చేసిన నాగార్జున
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ సీజన్ 7 తాజాగా ప్రారంభం అయింది. ఇప్పటి వరకు 6 సీజన్లు ముగిశాయి. అయితే.. బిగ్ బాస్ సీజన్ 6 అంతగా సక్సెస్ కాలేదు. అందుకే బిగ్ బాస్ సీజన్ 7 ను చాలా కొత్తగా డిజైన్ చేశారు. అస్సలు ఎవ్వరూ ఊహించని విధంగా బిగ్ బాస్ 7 ఉండబోతోంది. తొలి రోజు 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లారు. కానీ.. వాళ్లంతా ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఉండేందుకు అర్హత సాధించలేదని.. వాళ్లకు ఒక టాస్క్ ఇస్తామని ఆ టాస్క్ గెలిచిన వాళ్లకే పవర్ అస్త్ర లభిస్తుందని అది ఉంటేనే బిగ్ బాస్ హౌస్ లో ఉండే చాన్స్ ఉంటుందని హోస్ట్ నాగార్జున చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
అయితే.. ఇప్పటి వరకు హౌస్ లోకి వెళ్లిన వాళ్లలో తొలి కంటెస్టెంట్ జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ ప్రియాంకా జైన్ కాగా.. ఆ తర్వాత యాక్టర్ శివాజీ, సింగర్ దామిని, మోడల్ ప్రిన్స్ యావర్, నటి శుభశ్రీ, షకీలా, ఆట సందీప్, కార్తీక దీపం శోభా శెట్టి, టేస్టీ తేజా, రతిక రోస్, గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, అమరదీప్ చౌదరి వెళ్లారు. ఇప్పటి వరకు హౌస్ లోకి వెళ్లిన వాళ్లు 14 మంది. ఆ 15 వ కంటెస్టెంట్ ఎవరో కాదు.. జాతిరత్నం నవీన్ పొలిశెట్టి. తొలిసారి ఒక హీరో బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టబోతున్నాడు. అందుకే ఈ సీజన్ ను ఉల్టా పుల్టా అనే పేరు పెట్టారు. అంటే ఈ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు.
Bigg Boss Telugu 7 : అమ్మాయిలతో కలకలలాడుతున్న బిగ్ బాస్ హౌస్
ఇక.. బిగ్ బాస్ హౌస్ మాత్రం అమ్మాయిలతో కలకలలాడుతోంది. బిగ్ బాస్ హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్లు రాగా.. అందులో ఏడుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు. కానీ.. ఈసారి అందమైన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. అంటే.. బిగ్ బాస్ హౌస్ లో తొలి రోజు నుంచే కాంపిటిషన్ స్టార్ట్ అవబోతోంది.
ఇక.. హౌస్ లోకి అడుగుపెట్టిన ఫస్ట్ ఐదుగురికి తొలిరోజే బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చేశాడు. ఆ ఐదుగురిలో ఒకరికి 35 లక్షల క్యాష్ ఉన్న సూట్ కేస్ ఇచ్చి ఇంట్లో నుంచి తక్షణమే వెళ్లిపోవాలని చెబుతాడు. చివర్లో టాప్ 5 కంటెస్టెంట్లకు వచ్చే ఆఫర్ అది. కానీ.. బిగ్ బాస్ ప్రారంభమైన తొలి రోజే ఇలాంటి ఆఫర్ రావడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. కానీ.. ఆ ఆఫర్ కు ఎవ్వరూ టెంప్ట్ కాలేదు.
ఇక.. ప్రస్తుతం ఉన్న 14 మంది కంటెస్టెంట్లలో చాలా యాక్టివ్ గా, తెలివిగా ఉన్న కంటెస్టెంట్ మాత్రం రతిక రోస్ అనే చెప్పుకోవాలి. నిజానికి తను ఒక హీరోయిన్. అయినా తనను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం బిగ్ బాస్ హౌస్ కి వచ్చింది. తన కాన్ఫిడెన్స్ చూస్తుంటే బిగ్ బాస్ 7 విన్నర్ అయ్యే చాన్స్ ఉంది. తను కొంచెం కష్టపడితే ఈజీగా విన్నర్ కావచ్చు.
మిగితా వాళ్లలోనూ కొందరు టఫ్ కాంపిటిషన్ ఇచ్చే చాన్స్ ఉంది. ఇక 14 మందిలో అందరూ సెలబ్రిటీలే.. ఒక్క పల్లవి ప్రశాంత్ తప్ప. పల్లవి ప్రశాంత్ ఒక సాధారణ రైతు బిడ్డ. ఇంత దూరం ఆయన రావడమే గ్రేట్. కానీ.. అతడికి జనాల నుంచి మద్దతు లభిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.