Pallavi Prashanth Arrest : బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను అరెస్టు చేసిన పోలీసులు .. తన స్వగ్రామం నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలింపు ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pallavi Prashanth Arrest : బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను అరెస్టు చేసిన పోలీసులు .. తన స్వగ్రామం నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలింపు ..!

 Authored By anusha | The Telugu News | Updated on :20 December 2023,8:30 pm

ప్రధానాంశాలు:

  •  Pallavi Prashanth Arrest : బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను అరెస్టు చేసిన పోలీసులు ..

  •  పల్లవి ప్రశాంత్ తన స్వగ్రామం నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలింపు ..!

Pallavi Prashanth Arrest : ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. గత సీజన్ కంటే ఈ సీజన్ అత్యధిక టీఆర్పీ రేట్ లను సొంతం చేసుకుంది. ఇక ఈసారి బిగ్ బాస్ 7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచారు. అయితే ఈరోజు పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. తన స్వగ్రామం అయిన కొల్లూరులో పల్లవి ప్రశాంత్ ని అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 20వ తేదీ సాయంత్రం పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. కొల్లూరు వచ్చిన పోలీసులు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన అల్లర్ల కేసులో అరెస్టు చేసినట్లు ప్రకటించారు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ప్రకటన తర్వాత ఆదివారం అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్ దీప్ అభిమానుల మధ్య పెద్ద గొడవ జరిగింది. రెండు వర్గాలు రెచ్చిపోయి కొట్టుకున్నారు.

ఆరు సిటీ ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. బస్సు అద్దాలను పగలగొట్టారు. బందోబస్తు కోసం వచ్చిన పంజాగుట్ట పోలీస్ వాహనాలతో పాటు బెటాలియన్ బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దగ్గర హంగామా సృష్టించారు. రెండు వర్గాల రాళ్లదాడిలో పలుకార్లు అద్దాలు పగిలిపోయాయి అమర్ దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. ఇలా ప్రభుత్వ ప్రైవేటు వాహనాలపై దాడి చేసిన పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేయడంతో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. ఈ అల్లర్లపై బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంతపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. పల్లవి ప్రశాంత్ ని A1 గా, అతని సోదరుడు మనోహర్ ను A 2 గా, ఫ్రెండ్ వినయ్ ని A 3 గా చేర్చారు.

ఈ క్రమంలోనే పోలీసులు పల్లవి ప్రశాంత్ ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్లూరు గ్రామంలోని ఇంట్లో పల్లవి ప్రశాంత్ అతని తమ్ముడిని అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ తరలిస్తున్నారు. కేసు ఆ స్టేషన్ లోనే నమోదు కావడంతో ఇప్పుడు హైదరాబాదుకి తీసుకొస్తున్నారు. పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన ఈ హంగామాకి బిగ్ బాస్ గెలిచిన ప్రశాంత్ కి సంతోషం లేకుండా పోయింది. అభిమానులు చేసిన పనికి పల్లవి ప్రశాంత్ పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి పరిస్థితి వచ్చింది. పల్లెటూరికి చెందిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఇలా బిగ్ బాస్ లోకి వెళ్లడం చాలా గ్రేట్ అని చెప్పాలి. వెళ్లడమే కాకుండా అతడు టైటిల్ గెలుచుకున్నాడు. రెండు రాష్ట్రాలలో పల్లవి ప్రశాంత్ హాట్ టాపిక్ అయ్యారు.

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది