Bimbisara Movie : బింబిసార తర్వాత ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని తెగ తిట్టేస్తున్నారట
Bimbisara Movie : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని స్వయంగా ఆయన అభిమానులు తిట్టుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఇటీవల అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ ఈవెంట్ లో ఎన్టీఆర్ ని చూసిన తర్వాత ఆయన లుక్ గురించి అభిమానుల్లో ఒక రకమైన చర్చ మొదలైంది. అది నెగిటివ్ కి దారితీసింది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ చాలా సన్నబడ్డాడు అంటూ అభిమానులు భావించారు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చూసిన ప్రేక్షకులు అంతా కూడా ఆశ్చర్యపోయారు, ముఖ్యంగా అభిమానులు షాక్ కి గురి అయ్యారు.
అన్నయ్య ఇలా అయ్యారేంటీ అంటూ కామెంట్స్ గుప్పించారు, కొరటాల శివ దర్శకత్వం లో సినిమా ఇంకా ఎప్పుడు ప్రారంభిస్తారో క్లారిటీ లేదు. అందుకే ఎన్టీఆర్ ఇలా ఫిజిక్ పెంచి కూర్చున్నాడు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం కొరటాల శివ సినిమా కోసమే ఇలా మారాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ యొక్క లుక్ గురించి విపరీతంగా చర్చ జరుగుతున్న సమయంలో అభిమాన సంఘం కి చెందిన వారు కూడా ఎన్టీఆర్ ఇలా చేసి ఉండకూడదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొరటాల శివ స్క్రిప్టు రెడీ గా లేకపోతే బుచ్చిబాబుతో ఆయినా సినిమా చేయాలని ఎన్టీఆర్ కి చాలా మంచి సలహా ఇస్తున్నారు. ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా తన లుక్ కు అంతా మార్చుకుంటూ అభిమానులను నొప్పిస్తే ఉన్నాడంటూ విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ కి ఇదే అదునుగా అన్నట్లుగా మారింది. ఎన్టీఆర్ లుక్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కూడా పెద్ద ఎత్తున వారు ట్రోల్ చేస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఎన్టీఆర్ అభిమానులు స్వయంగా ఎన్టీఆర్ ని తిట్టుకుంటున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.