Suresh Babu : ఫిలింనగర్ భూ వివాదంలో నిర్మాత సురేష్ బాబు, రానా లపై కేసు నమోదు..!!

Authored By Breaking News | The Telugu News | Published on: February 11, 2023, 12:20 pm

Suresh Babu : గత కొంతకాలంగా ఫిలింనగర్ లో ఓ ల్యాండ్ కి సంబంధించి వివాదం నడుస్తూ ఉంది. ఈ వివాదంలో నిర్మాత సురేష్ బాబు హీరో రానాకీ వ్యాపారవేత్త ప్రమోద్ కుమార్ మధ్య గొడవ జరుగుతూ ఉంది. ఈ వివాదం విషయంలో పలుమార్లు రానా కోర్టుకు కూడా హాజరు కావడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు సురేష్ బాబు మరియు రానా ఇటీవల తనని రౌడీల సహాయంతో బెదిరించి తన స్థలం నుండి ఖాళీ చేయించారని.. బంజారాహిల్స్ పోలీసులకు ప్రమోద్ కుమార్ ఫిర్యాదు చేశారు. కానీ సదరు వ్యాపారి ఫిర్యాదును బంజర హిల్స్ పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు.

case registered against suresh babu and rana in filmnagar land dispute

case registered against suresh babu and rana in filmnagar land dispute

దీంతో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో… పోలీసులకు సంబంధం లేకుండా నాంపల్లి కోర్టు కేసు నమోదు చేసింది. సురేష్ బాబు రానా సహా మరి కొంతమంది పై కేసు నమోదు అయింది. దీంతో విచారణకు రావాలని రానా మరియు సురేష్ బాబు కి నాంపల్లి కోర్టు సమాన్లు జారీ చేయడం జరిగింది. అసలు గొడవ చూస్తే ఫిలింనగర్ లో సురేష్ బాబుకి ఉన్న ఓ స్థలాన్ని ప్రమోద్ కుమార్ అనే వ్యాపారికి లీజుకి ఇవ్వడం జరిగింది. ప్రతి రెండేళ్లకి ఆ లీజు రెన్యూవల్ చేస్తారు.

కానీ కొన్ని నెలల క్రితం ఆ స్థలం లీజులో ఉండగానే అందులో కొంత భాగాన్ని రానా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయటంతో పాటు వ్యాపారిని ఖాళీ చేయమని ఒత్తిడి తేవడంతో ప్రమోద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగకపోవటంతో కోటిని ఆశ్రయించడంతో పోలీసులతో సంబంధం లేకుండా సురేష్ బాబు మరియు రానా మరికొంతమందిపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించడం జరిగింది.

Breaking News

No bio available for this author.

  1. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  2. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  3. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  4. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  5. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  6. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  7. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp