Chandra Mohan : హాస్పిటల్ లో అసలేం జరిగింది .. చంద్రమోహన్ చనిపోవడానికి కారణం ఏంటి .. ??
Chandra Mohan : టాలీవుడ్ ప్రముఖ నటుడు చంద్రమోహన్ నవంబర్ 11న ఉదయం 9:45 నిమిషాలకు మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నవంబర్ 11న హృద్రోగ సమస్యతో అపోలో ఆసుపత్రికి చేరి చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేశారు. దాదాపుగా 975 సినిమాలలో నటించారు. 1945 మే 23న కృష్ణాజిల్లాలో […]
ప్రధానాంశాలు:
Chandra Mohan : హాస్పిటల్ లో అసలేం జరిగింది ..
చంద్రమోహన్ చనిపోవడానికి కారణం ఏంటి .. ??
టాలీవుడ్ ప్రముఖ నటుడు చంద్రమోహన్ నవంబర్ 11న ఉదయం 9:45 నిమిషాలకు మృతి చెందారు
Chandra Mohan : టాలీవుడ్ ప్రముఖ నటుడు చంద్రమోహన్ నవంబర్ 11న ఉదయం 9:45 నిమిషాలకు మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నవంబర్ 11న హృద్రోగ సమస్యతో అపోలో ఆసుపత్రికి చేరి చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేశారు. దాదాపుగా 975 సినిమాలలో నటించారు. 1945 మే 23న కృష్ణాజిల్లాలో జన్మించారు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. రంగులరాట్నం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన 175 సినిమాలలో హీరోగా చేశారు.
పదహారేళ్ళ వయసు సినిమా ఆయనకు నటుడిగా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. ఇక టాలీవుడ్ లో చంద్రమోహన్ దివంగత స్టార్స్ అయినా సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు చాలా సన్నిహితంగా ఉంటారు. ఇండస్ట్రీలో చంద్ర మోహన్ లక్కీ హ్యాండ్ అని చెబుతుంటారు. ఈయనతో తొలిసారిగా నటించిన చాలామంది హీరోయిన్లు స్టార్ లుగా రాణించారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కె . విశ్వనాథ్ చంద్రమోహన్ కి కజిన్ అవుతారు. అందుకే ఎక్కువగా చంద్రమోహన్ విశ్వనాధ్ గారి సినిమాలలో నటించారు. అలాగే ప్రముఖ డైరెక్టర్ బాపు గారు కూడా చంద్రమోహన్ కి బంధువులు అవుతారు. అందుకే ఆయన సినిమాలలో కూడా ఎక్కువగా నటించారు.
చంద్రమోహన్ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ భాషలో కూడా సినిమాలు చేశారు. ఆయన నటనకు రెండు ఫిలిం ఫేర్ అవార్డులు, ఆరు మంది అవార్డులు వచ్చాయి. పదహారేళ్ల వయసు, సిరిసిరిమువ్వ సినిమాలో ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది. అయితే ఆయన మరణానికి గల కారణం అనారోగ్య సమస్య అని తెలుస్తుంది. 82 ఏళ్ల వయసు కలిగిన చంద్రమోహన్ గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రి చేరినట్లు తెలుస్తోంది. ఆయన వయసు కూడా పైబడడంతో అనారోగ్య సమస్యతో మరణించినట్లుగా తెలుస్తుంది.