Nithin Check Movie : చెక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Check Movie Worldwide Pre-Release Business : చెక్ మూవీ థియేట్రికల్ బిజినెస్
Nithin Check Movie : యంగ్ హీరో నితిన్ నటించిన చెక్ మూవీ తాజాగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. సినిమా విడుదల కాకముందే సంచలనాలను సృష్టించింది. ఎందుకంటే.. నితిన్ ఒక స్టార్ హీరో. ఆయన సినిమా వచ్చి కూడా చాలా రోజులు అయింది. ఆయనకు ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నితిన్ కు సపోర్ట్ చేస్తుంటారు. చాలా రోజుల తర్వాత నితిన్ నుంచి వచ్చిన సరికొత్త సినిమా చెక్ కావడం.. అందులోనూ ప్రస్తుతం నాంది సినిమా తర్వాత మళ్లీ అంతలా తెలుగులో ఆకట్టుకునే సినిమా లేకపోవడంతో.. చెక్ సినిమా బిజినెస్ విడుదలకు ముందే బాగానే జరిగింది.

Check Movie Worldwide Pre-Release Business
Nithin Check Movie world wide theatrical business is 15. 68 crores
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చెక్ సినిమా థియేట్రికల్ బిజినెస్ 15. 68 కోట్లు అని తెలిసింది. నైజాం ఏరియాలో 5.40 కోట్లు, సీడెడ్ ఏరియాలో 2.20 కోట్లు, యూఏలో 1.80, ఈస్ట్ లో 1.12 కోట్లు, వెస్ట్ లో ఒక కోటి, కృష్ణా జిల్లాలో 1.10 కోట్లు, గుంటూరులో 1.30 కోట్లు, నెల్లూరులో 0.56 కోట్లుగా ఉంది. కేవలం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో చెక్ సినిమా థియేట్రికల్ బిజినెస్ 14.48 కోట్లుగా ఉంది. కర్నాటక, యూఎస్ఏ, ఓవర్సీస్ బిజినెస్ 1.20 కోట్లుగా ఉంది.