Chiranjeevi : చిరంజీవి రేంజ్ అది.. ఓవర్సీస్ లో ఆచార్య బిజినెస్ చూస్తే నోట మాట రాదు ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chiranjeevi : చిరంజీవి రేంజ్ అది.. ఓవర్సీస్ లో ఆచార్య బిజినెస్ చూస్తే నోట మాట రాదు ..!

Chiranjeevi : చిరంజీవి సినిమాలను ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో , ఆయనకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు మించిన చరిష్మా చిరంజీవి సొంతం . ఇక ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పండుగే. ఇక ఆయన సినిమాల బిజినెస్ విషయానికి వస్తే అంచనాలు మించిపోతాయ్ . ఏ మూవీ రిలీజ్ అయినా హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. మెగాస్టార్ చిరంజీవి , కొరటాల శివ కాంబినేషన్ […]

 Authored By govind | The Telugu News | Updated on :6 February 2021,4:30 pm

Chiranjeevi : చిరంజీవి సినిమాలను ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో , ఆయనకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు మించిన చరిష్మా చిరంజీవి సొంతం . ఇక ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పండుగే. ఇక ఆయన సినిమాల బిజినెస్ విషయానికి వస్తే అంచనాలు మించిపోతాయ్ . ఏ మూవీ రిలీజ్ అయినా హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. మెగాస్టార్ చిరంజీవి , కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందనున్న బిగ్ బడ్జెట్ సినిమా ఆచార్య ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. చిరు హీరో గా, రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో ఆచార్య మూవీ లో కనిపించనున్నారు. దీనితో ఈ మూవీ పై ప్రేక్షకుల అంచనాలు భారీగానే ఉన్నాయ్.

Chiranjeevi చిరంజీవి రేంజ్ అది ఓవర్సీస్ లో ఆచార్య బిజినెస్ చూస్తే నోట మాట రాదు

Chiranjeevi : చిరంజీవి రేంజ్ అది.. ఓవర్సీస్ లో ఆచార్య బిజినెస్ చూస్తే నోట మాట రాదు ..!

మే లో మూవీ రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేయడం తో రోజులు గడుస్తున్నా కొద్దీ ఆచార్య పై అంచనాలు పెరిగిపోతున్నాయి . లేటెస్టు గా ఆచార్య మూవీ ఓవర్సీస్ బిజినెస్ చూస్తే ఇక నోటా మాట రాదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య మూవీ కి భారీగా బిజినెస్ జరుగుతోంది . ఇక ఓవర్సీస్ లోనూ ఆచార్య బిజినెస్ దుమ్ము దులిపేస్తోంది. మెగాస్టార్ తన గత సినిమాల రికార్డులు అన్నీ బ్రేక్ చేస్తున్నారని టాలీవుడ్ టాక్.ఇప్పటికే ఆచార్య నైజాం హక్కులు రూ.42 కోట్లకు అమ్ముడు పోయాయి . ఇక ఆంధ్ర సీడెడ్ కలిపి రూ.60 కోట్లకు పైగానే బిజినెస్ జరిగింది.

Chiranjeevi : అన్నయ్య సినిమా బిజినెస్ రూ.120 కోట్లట..?

ఇక విదేశీ హక్కుల కోసం రూ.20 కోట్లకు పైగానే కోట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ లో ప్రచారం జోరుగా సాగుతోంది . ఇంకా సినిమా విడుదలే కానే లేదు కానీ అన్నయ్య సినిమా బిజినెస్ రూ.120 కోట్ల మేర చేస్తున్నట్లు లెక్కలు అందుతున్నాయి. ఇది ఇంకా ఫైనల్ కాలేదు . అంతకు మించి బిజినెస్ జరగవచ్చని తెలుస్తోంది. మరో 3 నెలల్లో సినిమా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు చేస్తున్నారు . ఇప్పటికే మూవీ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు . మే 13 న ఆచార్య విడుదల కానుంది. మరి బిజినెస్ కి తగ్గట్లుగానే ఆచార్య.. తెరపై ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది