Fish Venkat : ఫిష్ వెంకట్ అనారోగ్య పరిస్థితి తెలుసుకొని చలించిపోయిన చిరు, చరణ్.. వెంటనే ఏం చేశారంటే..!
ప్రధానాంశాలు:
Fish Venkat : ఫిష్ వెంకట్ అనారోగ్య పరిస్థితి తెలుసుకొని చలించిపోయిన చిరు, చరణ్.. వెంటనే ఏం చేశారంటే..!
Fish Venkat : టాలీవుడ్‌లో కొందరు స్టార్స్ ఒకానొకప్పుడు ఓ వెలుగు వెలిగి ఇప్పుడు మాత్రం చాలా దారుణమైన స్థితిని చవి చూస్తున్నారు. వారిలో ఫిష్ వెంకట్ ఒకరు. చిన్న పాత్రలు అయినా..మంచి పేరు తెచ్చుకున్నవారిలో పావలా శ్యామల.. ఫిష్ వెంకట్, నర్సింగ్ యాదవ్ లాంటి వారు ఎందరో ఉన్నారు. అయితే అలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకోవలసింది ఫిష్ వెంకట్ గురించి. ఆయన ఈమధ్య సినిమాల్లో కనిపించడం లేదు. ఎక్కడున్నారు.. ఏమైపోయారు అని కామెడీ ప్రియులు ఆలోచనలో పడ్డారు. ఫిష్ వెంకట్ హైదరాబాద్‌లోని రాంనగర్ ప్రాంతంలో నివస్తున్నాడు. ఆయన కొద్ది నెలలుగా అనారోగ్యానికి గురయ్యాడు. కాళ్లకు గాయాలు కావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ దశలో రెండు కాళ్లు తీసేయాలని వైద్యులు సూచించారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో గాంధీ హస్పిటల్‌లో చేర్పించాం అని కుటుంబ సభ్యులు తెలిపారు.
Fish Venkat మెగా అండ..
గాంథీ హాస్పిటల్‌లో చేరిన ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో ఇటీవల ఆయన డిశ్చార్జ్ అయ్యారు. కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పిన సూచన మేరకు ఆయన ఇంటిలో ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది అని స్నేహితులు, సన్నిహితులు చెప్పారు. ఇక ఫిష్ వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీ నాకు అండగా నిలిచారు. చిరంజీవి, రాంచరణ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. వారు నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని అండగా నిలిచారు. అందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఫిష్ వెంకట్ చెప్పారు. రీసెంట్ గా ఓ ఫేమస్ యూట్యూబ్ ఛానెల్ ఆయన ఏం చేస్తున్నారు.. ఆయన పరిస్థితి ఏంటీ అనేది బయట ప్రపంచానికి తెలిసేలా చేశారు.
టాలీవుడ్ ఆడియన్స్ లో ఫిష్ వెంకట్ అంటే తెలియని వారు ఉండరు. ఆది మూవీతో వెండితెరపై అడుగు పెట్టిన ఫిష్ వెంకట్.. కామెడీ టచ్ ఉండే రౌడీ పాత్రల ద్వారా పాపులర్ అయ్యాడు. తనదైనన తెలంగాణ యాస, నటనతో స్పెషల్ ఇమేజ్ సాధించాడు ఫిష్ వెంకట్. దాదాపుగా 25 ఏళ్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగిన వెంకట్.. 2002 నుంచి గత ఏడాది వరకు వందకు పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు. ఆతరువాత చిన్నగా సినిమాల్లో కనిపించడం తగ్గిపోయింది. కారణం ఏంటని కామెడీ ప్రియులు వెతుక్కున్నారు.