Chiranjeevi Balakrishna : సీఎం రేవంత్ తో భేటీకి చిరు, బాలయ్య, సినీ అగ్రహీరోలు డుమ్మాకి కారణం..?
Chiranjeevi Balakrishna : సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ తెలిసిందే. పుష్ప 2 ప్రీమియర్ షో టైం లో మహిళ మృతి చెందగా ఆ ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు. అంతేకాదు అసెంబ్లీలో ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇక మీదట సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ ప్రైజ్ లు పెంచేది లేదని అన్నారు. ఐతే ఈ విషయం పై ఎఫ్.డీ.సీ చైర్మన్ దిల్ రాజు సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య వర్తిత్వం ఉంటూ సమస్య పరిష్కారానికి చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తో సినీ ప్రముఖుల భేటీ జరుగుతుంది. ఐతే ఈ మీటింగ్ లో సినీ దిగ్గజాలు ఎవరు పాల్గొన్నట్టు లేదు. దర్శకుల నుంచి రాజమౌలి, హీరోల నుంచి స్టార్స్ ఎవరు ఈ మీటింగ్ లో పాల్గొనట్లేదు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ ఈ మీటింగ్ కు అటెండ్ అవ్వట్లేదు. సీఎం జగన్ మీటింగ్ టైం లో మహేష్, ప్రభాస్, చిరంజీవి సహా అందరు వెళ్లారు కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న సీఎం మీటింగ్ కి వాళ్లెవ్వరూ కదల్లేదు.
Chiranjeevi Balakrishna బెనిఫిట్ షోస్ విషయంలో కఠినంగా..
పుష్ప 2 ఇష్యూని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఐతే ఇక మీదట ఇవి జరగకూడదు అనే బెనిఫిట్ షోస్ విషయంలో కఠినంగా ఉంటున్నట్టు చెప్పారు. మీటింగ్ లో కూడా బెనిఫిట్ షోస్ విషయంలో మాట మార్చుకునేది లేదని రేవంత్ రెడ్డి వెల్లడించారని తెలుస్తుంది.
ఐతే వీటితో పాటు తెలంగాణా ప్రభుత్వానికి సినీ ప్రముఖులు సపోర్ట్ గా ఉండాలని. యాంట్రీ డ్రగ్ ఇంకా సోషల్ కాజ్ విషయాలను ప్రమోట్ చేయాలని సూచించారు. శాంతిభద్రత విషయంలో రాజీపడేది లేదన్న సీఎం అభిమానులను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత హీరోలదే అని.. బౌన్సర్లపై సీరియస్ గా ఉంటామన్న విషయాన్ని చెప్పారు. ఐతే సీఎం రేవంత్ మీటింగ్ కు బాలయ్య, చిరంజీవి మిస్ అవ్వడం పట్ల రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్లు కావాలనే డుమ్మా కొట్టారని కొందరు అంటుంటే వేరే బిజీ పనుల వల్ల వాళ్లు రాలేకపోయారని అంటున్నారు.