Conductor Jhansi : 11 సంవత్సరాల క్రితమే కండక్టర్ ఝాన్సీ టీవీలో వచ్చింది తెలుసా!
Conductor Jhansi : గాజువాక లేడీ కండక్టర్ ఝాన్సీ ఇప్పుడు సోషల్ మీడియా లో మోస్ట్ క్రేజీ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ లో కండక్టర్ ఝాన్సీ పల్సర్ బండి డాన్స్ కి వేసిన డాన్స్ తో ఒక్కసారిగా ఆమెపై అందరి దృష్టిపడింది. ఇప్పుడు ఆమె సోషల్ మీడియా సెన్సేషన్.. బుల్లి తెరస్టార్. త్వరలోనే వెండి తెర స్టార్ గా మారబోతుంది. సంపూర్ణేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఒక సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు గాను ఝాన్సీకి అవకాశం వచ్చింది. సంపూర్ణేష్ బాబు మాత్రమే కాకుండా మరో ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కూడా కండక్టర్ ఝాన్సీ కి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారని సమాచారం అందుతుంది. కండక్టర్ ఝాన్సీ కి ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ లో స్టార్డం రాలేదు.. అదృష్టం కలిసి వచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించడం వల్ల ఆమెకు అవకాశం వచ్చింది.
చాలా మందికి తెలియని విషయం ఏంటీ అంటే ఆమె 11 సంవత్సరాల క్రితమే టీవీ ఛానల్ లో కనిపించింది.. అది కూడా జీ తెలుగు ఛానల్లో. ఆమె తీన్మార్ అనే డాన్స్ కార్యక్రమంలో సందడి చేసింది. ఆ డాన్స్ కార్యక్రమానికి కూడా ఇంద్రజ జడ్జ్ అవ్వడం విశేషం. ఆ సమయంలోనే యాంకర్ ఉదయ భాను గాజువాక ఆర్టీసీ బస్సు కండక్టర్ ఝాన్సీ అంటూ ఆమెను స్టేజ్ పైకి పిలిచిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ సమయంలో సోషల్ మీడియా ఈ స్థాయిలో లేదు. కనుక కండక్టర్ ఝాన్సీ కి అప్పుడు పెద్దగా క్రేజ్ దక్కలేదు. జీ తెలుగులో కనిపించిన కూడా కండక్టర్ ఝాన్సీ కి పెద్దగా అవకాశాలు రాకపోవడంతో రికార్డింగ్ ట్రూప్ లో సభ్యురాలుగా ఉండి పండగలకు జాతర్లకు డాన్సులు వేస్తూ వచ్చింది. ఇప్పుడు కండక్టర్ ఝాన్సీ స్థాయి పెరిగింది.
సినిమాల్లో మరియు బుల్లి తెర స్టేజ్ షో లో ఆమె సందడి చేస్తుంది. ఒకప్పుడు 1000, 2000 రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న కండక్టర్ ఝాన్సీ ఇప్పుడు 20,000, 30,000 రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ తన స్థాయిని అమాంతం పెంచేసుకుంది. ప్రస్తుతం ఆమె యొక్క డిమాండ్ ఏ రేంజ్ లో ఉంది అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్లు మళ్లీ పిలిస్తే వెళ్ళలేనంత బిజీగా ఉంది. ఆమె మాస్టర్ రమేష్ కూడా ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యాడు. చూడ్డానికి పొట్టిగా ఉన్నా కూడా అతడు ఝాన్సీ వంటి ఎంతో మందిని తీర్చిదిద్దాడంటూ 11 సంవత్సరాల క్రితమే తీన్మార్ కార్యక్రమంలో ఉదయ భాను చెప్పడం విశేషం. ఇప్పుడు ఆయన గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కండక్టర్ ఝాన్సీ యొక్క పాత వీడియోలు యూట్యూబ్ లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అందులో జీ తెలుగు తీన్మార్ డాన్స్ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి.