Deepthi Sunaina : షణ్ముఖ్‌ని మిస్ అయిన బాధ ఏ మాత్రం కన్పించట్లేదుగా.. నవ్వుతూ తెగ రచ్చ చేస్తున్న దీప్తి సునయన
Deepthi Sunaina : గత కొద్ది రోజులుగా షణ్ముఖ్-దీప్తి సునయన వ్యవహారం చాలా ఆసక్తికరంగా సాగతుంది. బిగ్ బాస్ హౌజ్‌లో స్నేహితులం అని చెప్పుకునే సిరి షణ్ముఖ్.. హగ్గులు తీసుకున్న విధానం చూసి చాలా మంది వారిద్దరిని చాలా రకాలుగా ట్రోల్ చేశారు. ఏకంగా షణ్ముఖ్ జస్వంత్ ప్రియురాలు దీప్తి సునయన అయితే బ్రేక్ అప్ చెప్పింది. షణ్ముఖ్ జశ్వంత్- దీప్తి సునయన కు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్ గా వీరు రెండో సారి బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరు విడిపోయిన కూడాతెగ వార్తలలో నిలుస్తున్నారు.
షణ్ముఖ్ జస్వంత్ కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన షణ్ముఖ్ జస్వంత్ ముందుగా కవర్ సాంగ్స్ చేసే వాడు.. ఆ తర్వాత చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేయడం మొదలు పెట్టి వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. దీప్తి సునయన కూడా అతనితో చాలా వీడియోలు చేసింది. అలా ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది. కాని ఏవోకారణాల వలన ఈ ఇద్దరు విడిపోయిన అభిమానులని ఆందోళనకు గురి చేశారు. విడిపోయినప్పటి నుండి అభిమానులు ఈ ఇద్దరు తిరిగి కలిస్తే బాగుండని కోరుకుంటున్నారు.

deepthi sunaina makes fun with dance
Deepthi Sunaina : దీప్తి స్టన్నింగ్ డ్యాన్స్..
అయితే షణ్ముఖ్ నుండి విడిపోయినప్పటి నుండి దీప్తి సునయన రచ్చ మాములుగా లేదు. తెగ వీడియోలు చేస్తూ సోషళ్ మీడియాలో షేర్ చేస్తుంది. ముఖ్యంగా ఆమె డ్యాన్స్ వీడియోలు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. తాజాగా దీప్తి సునయన థిలానాథిలానే అనే పాటకు తనదైన శైలిలో డ్యాన్స్ చేసింది. నవ్వుకుంటూ ఉత్సాహంగా ఈ ముద్దుగుమ్మ డ్యాన్స్ లు చేయగా, ఈ అమ్మడిని చూసిన నెటిజన్స్ షణ్ముఖ్ నుండి విడిపోయిన బాధ కొద్దిగా కూడా లేనట్టుందిగా అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీప్తి వీడియో వైరల్‌గా మారింది.
View this post on Instagram