Deepthi Sunaina : హోటల్ రూం నుంచి వెళ్లేందుకు కూడా భయపడ్డా.. నాటి గుట్టువిప్పిన దీప్తి సునయన
Deepthi Sunaina : దీప్తి సునయన ప్రస్తుతం తన ప్రియుడు షన్ను కోసం బయట బాగానే కష్టపడుతోంది. బిగ్ బాస్ ఇంట్లో పరిస్థితులు, వాతావరణం ఎలా ఉంటుందో దీప్తి సునయనకు తెలుసు. అందుకే ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా తన లవర్ షణ్ముఖ్‌ను మాత్రం దీప్తి సునయన సపోర్ట్ చేస్తూనే వస్తోంది. మొత్తానికి దీప్తి సునయన బయట జరుగుతున్న ట్రోలింగ్‌ను మాత్రం భరించలేకపోతోంది.
ఇక ఇప్పుడు షన్ను మీద ఎంత నెగెటివిటీ పెరిగిందో అందరికీ తెలిసిందే. కానీ షన్నుకి ఉన్న ఫ్యాన్ బేస్ వల్ల అదేమీ అంత ప్రభావం చూపించడం లేదు. కానీ ఈ నెగెటివ్ కామెంట్లు, ఇంతటి ద్వేష పూరిత పరిస్థితిని దీప్తి సునయన తట్టుకోలేకపోతోంది. అందుకే తన గతంలో జరిగిన సంఘటనలను అందరికీ గుర్తు చేసింది. తాను బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన పరిస్థితులను వివరించింది.

Deepthi Sunaina Trolls On Bigg Boss 5 Telugu And Shanmukh
Deepthi Sunaina : వేడుకున్న దీప్తి సునయన..
ఎందుకు ఇంత ద్వేషం.. మీకు ఆ కంటెస్టెంట్ ఎందుకు అంత ఇష్టం? అనేది చెప్పుకుంటే సరిపోతుంది కదా? కామెంట్స్ చూస్తే భయం వేస్తుంది.. మేం ఇలా బయట ఉంటే సంతోషంగా ఉండటం మీకు నచ్చదా? మాకు సంతోషంగా బతికే అర్హత కూడా లేదా?.. నా ఎలిమినేషన్ తరువాత హోటల్ రూం నుంచి మా ఇంటికి వెళ్లటానికి కూడా భయం వేసింది. అంత వీక్ అయిపోయా. నాలా ఏ కంటెస్టెంట్ కూడా ఫీల్ అవ్వకూడదు. వారిని సంతోష పెట్టే శక్తి మీకుందంటూ అందరినీ వేడుకుంది దీప్తి సునయన.