Dhanush Aishwarya : ఒకే పార్టీలో ఎదురెదురు పడ్డ ధనుష్ ఐశ్వర్య.. ఇద్దరు మాట్లాడుకున్నారా..!
Dhanush Aishwarya: సరిగ్గా నెల రోజుల క్రితం రజనీకాంత్ అల్లుడు, కూతురు ధనుష్-ఐశ్వర్యలు తాము విడిపోతున్న విషయం ప్రకటించిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఈ జంట. తాము విడిపోతున్నట్లు కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా వేర్వేరు ప్రకటనలు చేశారీ మాజీ కపుల్. అయితే ధనుష్, ఐశ్వర్యలను కలిపేందుకు రజనీకాంత్ ప్రయత్నిస్తున్నారని, త్వరలోనే వారు కలుస్తారని ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఇటీవల వెల్లడించారు. అయితే ప్రస్తుతం ధనుష్, ఐశ్వర్య తమ తమ పనుల్లో మళ్లీ బిజీ అయినట్టు తెలుస్తోంది.
ధనుష్ ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘సార్’ సినిమా షూటింగ్‌లో తలమునకలై ఉన్నాడు. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ లాంటి ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సంయుక్తా మేనన్ ధనుష్ సరసన సందడి చేయనుంది. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలోను సినిమా చేస్తున్నాడు. ఇవే కాక పలు ప్రాజెక్టులు అతని చేతిలో ఉన్నాయి. ఇక ఐశ్వర్య విషయానికి వస్తే మెగా ఫోన్ పట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది.

dhanush aishwarya face to face in friends party
Dhanush Aishwarya : ఇక కలవరా..
ఇటీవల షూటింగ్ నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన ధనుష్-ఐశ్వర్యలు ఒకే హోటల్‌లో ఉన్నప్పటికీ కనీసం ఒకరినిఒకరు చూసుకొనే లేదట. ఇక తిరిగి చెన్నైకి వేరు వేరుగా వెళ్లిన ఈ ఇద్దరు ఓ కామన్ ఫ్రెండ్ పార్టీకి హజరైనట్లు తెలుస్తోంది. పార్టీలో ఈ మాజీ దంపతులు మాట్లాడుకుంటారేమోనని అక్కడికి వచ్చిన అతిథులంతా ఆసక్తిగా ఎదురు చూశారట. కానీ వారు మాత్రం దూరంగానే ఉన్నారట. ఒకరికి ఒకరు తెలియనట్టుగానే వ్యవహరించారట. కనీసం ఫ్రెండ్స్ లా అయిన ఉంటారేమో అనుకుంటున్న సమయంలో వారు ఇలా ప్రవర్తించడం అభిమానులకి బాధను కలిగిస్తుంది. కాగా, ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులైన ధనుష్-ఐశ్వర్య.. స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా కలిసి జీవించిన మేము ఈరోజు విడిపోవాలని నిర్ణయించుకున్నామని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన విషయం విదితమే.