Jabardasth Varsha : నిశ్చితార్థం అయిపోయింది షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన వర్ష..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jabardasth Varsha : నిశ్చితార్థం అయిపోయింది షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన వర్ష..!!

Jabardasth Varsha : జబర్దస్త్ ఫేమ్ వర్ష అందరికీ సుపరిచితురాలే. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో మంచి పాపులారిటీ సంపాదించింది. ఇమ్మానుయేల్ తో చేసే కామెడీ మంచి గుర్తింపు తీసుకురావడం జరిగింది. అందంతోపాటు కామెడీతో ఎంతగానో అలరించే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలు గురించి ఇంకా పలు ఫోటోషూట్స్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అలరిస్తూ ఉంటది. వర్ష తన పేరిట యూట్యూబ్ ఛానల్ లో […]

 Authored By sekhar | The Telugu News | Updated on :4 February 2023,5:00 pm

Jabardasth Varsha : జబర్దస్త్ ఫేమ్ వర్ష అందరికీ సుపరిచితురాలే. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో మంచి పాపులారిటీ సంపాదించింది. ఇమ్మానుయేల్ తో చేసే కామెడీ మంచి గుర్తింపు తీసుకురావడం జరిగింది. అందంతోపాటు కామెడీతో ఎంతగానో అలరించే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలు గురించి ఇంకా పలు ఫోటోషూట్స్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అలరిస్తూ ఉంటది. వర్ష తన పేరిట యూట్యూబ్ ఛానల్ లో పలు ఆసక్తికరమైన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే.

engagement is over Jabardasth Varsha released video

engagement is over Jabardasth Varsha released video

ఈ రకంగానే ఇటీవల నిశ్చితార్థం అయిపోయినట్లు త్వరలోనే పెళ్లి కొడుకు ఎవరో రివిల్ చేయబోతానని వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో చీరలు మరియు నగలు ఇంకా మేకప్ వేసుకునే విధానాన్ని చూపించారు. దీంతో వీడియో చూసిన వారు నిజంగానే వర్షకు ఎంగేజ్ మెంట్ అయిపోయిందేమోనని అనుకున్నారు. కాని చివరిలో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది వర్ష. ఈ వీడియో తనది కాదని రాకేష్- సుజాతల… నిశ్చితార్థానికి సంబంధించిన వీడియో అని క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో వర్ష పోస్ట్ చేసిన ఈ నిశ్చితార్థం వీడియో పై ఒకింత నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి.

engagement is over Jabardasth Varsha released video

engagement is over Jabardasth Varsha released video

ఎంటర్టైన్మెంట్ రంగంలో మంచి గుర్తింపు క్రేజ్ కలిగి ఉండి కూడా యూట్యూబ్ లో వ్యూస్ కోసం… నిశ్చితార్థం అయిపోయింది అని ఈ రకంగా హెడ్డింగులు పెట్టి వీడియోలు పోస్ట్ చేయడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి పిల్ల చేష్టలు చేస్తే ఉన్న పాపులారిటీ క్రేజ్… అమాంతం పడిపోతాయని చెప్పుకొస్తున్నారు. పెళ్లి ఇంకా నిశ్చితార్థం అనేది మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనవి. అటువంటి వాటిని కూడా ఉపయోగించి ఈ రీతిగా వీడియోలు పెట్టి అభిమానులను ఆందోళనలకు గురి చేయటం దారుణమని మరి కొంతమంది రియాక్ట్ అవుతున్నారు.

 

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది