Mallemala : ‘జాతిరత్నాలు’ని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్న మల్లెమాల, కారణం ఇదేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mallemala : ‘జాతిరత్నాలు’ని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్న మల్లెమాల, కారణం ఇదేనా?

 Authored By aruna | The Telugu News | Updated on :15 September 2022,1:30 pm

Mallemala : ఈటీవీలో ప్రసారం అవుతున్న మల్లెమాల కార్యక్రమాలు అన్నీ కూడా సూపర్ హిట్ అవుతున్నాయి. ప్రతి కార్యక్రమం కూడా మంచి సక్సెస్ ని సొంతం చేసుకోవడంతో పాటు ఎంతో మంది ఆర్టిస్టులను ప్రతిభావంతులను తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే ఉంది. అందులో జబర్దస్త్ మరియు ఢీ డాన్స్ షో లు కూడా ఉన్నాయి. ఇప్పుడు జాతి రత్నాలు అంటూ స్టాండ్ అప్ కామెడీతో ఈటీవీ ప్లస్ లో మల్లెమాల వారు సందడి చేస్తున్నారు. పెద్ద ఎత్తున కమెడియన్స్‌ ని తీసుకు వచ్చి వారితో కామెడీ చేయించి నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈటీవీ ప్లస్ లో ప్రసారమవుతున్న కారణము లేదా మరేంటో కానీ ఇప్పటి వరకు జాతి రత్నాలు కార్యక్రమం ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేక పోయింది.

ఒక వర్గం ప్రేక్షకుల వరకే ఈ షో ని చూస్తున్నారు అంటూ బుల్లి తెర విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ప్రసారమవుతున్న జాతి రత్నాలు కార్యక్రమాన్ని మెల్ల మెల్లగా ఆపేయాలని ఉద్దేశంతో మల్లెమాల టీం ఉన్నట్లుగా తెలుస్తుంది. శ్రీముఖికి మరియు కంటెస్టెంట్స్ కి భారీ పారితోషికం ఇవ్వాల్సి వస్తుంది. అందుకు తగ్గట్లుగా షో కి రేటింగ్ రావడం లేదు.. దాంతో మంచి ఆదాయం రావడం లేదు. అందుకే చేతి నుండి పెట్టడం ఎందుకు అనే ఉద్దేశంతో జాతి రత్నాలు కార్యక్రమాన్ని ఆపివేయాలని మల్లెమాల వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మల్లెమాల మరియు ఈటీవీ అతి త్వరలోనే ఒక చేదు వార్తని ఈటీవీ ప్లస్ ప్రేక్షకులకు చెప్పే అవకాశం ఉంది.

etv jathiratnalu show may be going to stop

etv jathiratnalu show may be going to stop

జాతి రత్నాలు కార్యక్రమం ఆపివేసిన మల్లెమాల మరియు ఈటీవీ వారు కలిసి కచ్చితంగా మరో మంచి కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు జాతి రత్నాలు కార్యక్రమాన్ని జబర్దస్త్ కమెడియన్స్ తో నింపివేస్తే కచ్చితంగా మంచి రేటింగ్ వచ్చేదని ఇద్దరు ముగ్గురు కమెడియన్స్ మాత్రమే జాతి రత్నాలు కార్యక్రమంలో కనిపించడం వల్ల ఆశించిన స్థాయిలో రేటింగ్ రావడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మల్లెమాల మరియు ఈటీవీ చర్చిస్తే బాగుంటుంది అనేది కొందర అభిప్రాయం. మరి వారు ఏం నిర్ణయం తీసుకుంటారు.. జాతి రత్నాలు మరికొంత కాలం కొనసాగుతుందా లేదంటే వదిలించుకుంటారా అనేది చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది