Devi Sri Prasad : మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పై పోలీస్ కంప్లైంట్ చేసిన ప్రముఖ నటి..!!
Devi Sri Prasad : మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి మాస్ సాంగ్ లతో సంగీత ప్రేక్షకులను ఎంతగానో అలరించే దేవిశ్రీప్రసాద్ వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు. గత ఏడాది పుష్ప సాంగులతో సంగీత ప్రపంచాన్ని ఒక ఊపు ఊపాడు.
అటువంటి దేవి శ్రీ ప్రసాద్ సొంతంగా కంపోజ్ చేసిన “ఓ పారి” అనే ఆల్బమ్ లో హిందువులు పవిత్రంగా జపించే హరే రామ.. హరే కృష్ణ అనే భక్తి మంత్రాన్ని సాంగ్ లో పెట్టుకుని బికినీ దుస్తులలో నృత్యాలు చేయటం జరిగిందని.. హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్లు దేవి శ్రీ ప్రసాద్ పై కరాటే కళ్యాణి తో పాటు హిందూ సంఘాల నాయకులు సైబర్ క్రైమ్ లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.

famous actress filed police complaint against devi sri prasad
అనంతరం మీడియాతో కరాటే కళ్యాణి మాట్లాడుతూ…రామ జపాన్ని ఐటెం సాంగ్ మాదిరిగా చిత్రీకరించి … అశ్లీల దుస్తులలో దేవిశ్రీప్రసాద్ డాన్స్ చేయటాని ఖండించారు. ఒక హిందువు అయ్యుండి ఈ రీతిగా వ్యవహరించడం దారుణమని అన్నారు. వెంటనే ఆల్బమ్ నుండి హరే రామ.. హరే కృష్ణ మంత్రాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా హిందువులకు క్షమాపణలు చెప్పాలని వివరణ ఇవ్వాలని కరాటే కళ్యాణి కోరడం జరిగింది. ఒకవేళ క్షమాపణలు చెప్పకపోతే దేవి శ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.