Nagarjuna : నాగార్జున‌.. ఏంద‌య్యా నీ ప‌రిస్థితి ఇలా అయింది.. ఎలిమినేట్‌ చేసి తీరుతామంటున్న ఫ్యాన్స్

Advertisement

Nagarjuna :  బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ బాస్ కార్య‌క్ర‌మం రోజురోజుకి వివాదాల బాట ప‌డుతుంది. ఈ సీజ‌న్ లో స‌రైన కంటెస్టెంట్స్ ఎంపిక చేయ‌లేద‌ని, ఎలిమినేష‌న్ కూడా దారుణంగా జ‌రుగుతుంద‌ని, టాస్క్‌లు ఏదో తూతూ మంత్రంగా సాగుతున్నాయ‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. నాగార్జున సైతం ఈ సారి హోస్టింగ్ విష‌యంలో విమ‌ర్శ‌ల బారిన ప‌డుతున్నాడు. బిగ్ బాస్ రెండవ సీజన్ నుండి ఓటీటీ వెర్షన్ తో కలిపి 5 సీజన్స్ కి అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తుండ‌గా, మొద‌ట్లో ఆయ‌న‌కి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు వ‌చ్చాయి. కాని రాను రాను త‌గ్గుతూ పోతుంది.

Advertisement

బిగ్ బాస్ షో అంటేనే అసలు ఇష్టం లేదని చెప్పిన నాగార్జున ఇన్ని సీజన్స్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించడం అందరిని ఆశ్చర్యాప‌రుస్తుంది. అయితే నాగార్జున బిగ్ బాస్ జర్నీ ఈ సీజన్ తో ముగియబోతుందని , దానికి కారణం పారితోషికం విషయం లో అక్కినేని నాగార్జున కి బిగ్ బాస్ యాజమాన్యం కి ఇటీవల ఏర్పడిన విభేదాలేన‌ని ఇండ‌స్ట్రీలో చ‌ర్చ న‌డుస్తుంది. ఈ షో కోసం నాగార్జున 3 నుండి 5 కోట్ల రూపాయిల వరుకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు… సీజన్ 6 కి అగ్రిమెంట్ ప్రకారం 6 కోట్ల రూపాయిల వరుకు ఇస్తామని డీల్ సెట్ చేశార‌ట‌. అయితే సీజ‌న్ రేటింగ్ స‌రిగ్గా లేక‌పోవ‌డంతో నిర్వాహ‌కుల‌కి న‌ష్టం వాటిల్లింద‌ని,

Advertisement
fans fire on nagarjuna
fans fire on nagarjuna

Nagarjuna : ఫ్యాన్స్ ఫైర్..!

ఆ నష్టాన్ని పూడ్చేందుకు కంటెస్టెంట్స్ కి రెమ్యూనరేషన్స్ దగ్గర నుండి..క్యాష్ ప్రైజ్ వరుకు అన్నిట్లో కోతలు విధిస్తుండ‌గా , నాగార్జున రెమ్యూనరేషన్ కి కూడా ఇప్పుడు మూడు కోట్ల రూపాయిల వరుకు కోత విధించిన‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు నాగార్జున ప‌క్ష‌పాతం చూపిస్తున్నాడ‌ని, కొంద‌రివైపే గేమ్ ఆడుతున్నాడ‌ని ప‌లువురు నాగ్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నువ్వు ఇలా చేస్తే నిన్ను ఎలిమినేట్ చేసి తీరుతామంటూ కొంద‌రు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. రాజ్ ఎలిమినేష‌న్ అస్స‌లు స‌రిగా లేద‌ని నాగ్ కూడా దీనిపై ఏం మాట్లాడ‌క‌పోవ‌డం బాధ‌గా ఉంద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు.

Advertisement
Advertisement