Guppedantha Manasu 12 Dec Today Episode : వసుధార, రిషి పెళ్లి చేసుకుంటారా? మిషన్ ఎడ్యుకేషన్ కు హెడ్ గా వసుధారను నియమించిన జగతి.. ఇంతలో ట్విస్ట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 12 Dec Today Episode : వసుధార, రిషి పెళ్లి చేసుకుంటారా? మిషన్ ఎడ్యుకేషన్ కు హెడ్ గా వసుధారను నియమించిన జగతి.. ఇంతలో ట్విస్ట్

Guppedantha Manasu 12 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 డిసెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 631 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి, వసుధార ఇద్దరూ కారులో ఒక చోటుకు వెళ్తారు. ఏమైంది వసుధార ఇక్కడ ఎందుకు ఆపావు అంటే పానీపూరీ ఇక్కడ బాగుంటుంది అంటుంది వసుధార. దీంతో నువ్వు ఎప్పుడైనా ఏదైనా బాగోలేదన్నావా అంటాడు. దీంతో సార్.. మనం తినని వాటిని బాగలేదు […]

 Authored By gatla | The Telugu News | Updated on :12 December 2022,9:00 am

Guppedantha Manasu 12 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 డిసెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 631 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి, వసుధార ఇద్దరూ కారులో ఒక చోటుకు వెళ్తారు. ఏమైంది వసుధార ఇక్కడ ఎందుకు ఆపావు అంటే పానీపూరీ ఇక్కడ బాగుంటుంది అంటుంది వసుధార. దీంతో నువ్వు ఎప్పుడైనా ఏదైనా బాగోలేదన్నావా అంటాడు. దీంతో సార్.. మనం తినని వాటిని బాగలేదు అనొద్దు. మనకు నచ్చకుంటే తినకుండా వదిలేయాలి అంటుంది. పానీపూరీ బండి దగ్గరికి తీసుకెళ్లి పానీపూరీ, బేల్ పూరీ, ఇంకా పలు రకాలు కావాలని అడగడంతో అవన్నీ వద్దు అంటాడు రిషి. దీంతో పానీపూరీ మాత్రమే ఇవ్వు అంటుంది వసుధార. ఇద్దరూ కలిసి పానీపూరీ తింటారు. ఇంతలో తనకు ఇదివరకు ఇద్దరూ కలిసి కొబ్బరిబోండాం తాగిన విషయం గుర్తొస్తుంది.

guppedantha manasu 12 december 2022 full episode

guppedantha manasu 12 december 2022 full episode

తనకు తానే నవ్వుకుంటూ ఉంటుంది. దీంతో ఏమైంది అని అడుగుతాడు. దీంతో ఏం లేదు అంటుంది. దీంతో నాకు అర్థం అయిందిలే. మనం మొదటిసారి కొబ్బరిబోండాం తాగినప్పుడు నువ్వు దాని చరిత్ర మొత్తం చెప్పావు కదా అని అంటాడు. ఇంతలో పానీపూరీ బండి అతడు మీ పెళ్లి ఎప్పుడు సార్ అంటాడు. దీంతో ఏంటి అలా సడెన్ గా అడిగావు అంటాడు రిషి. దీంతో ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు కదా. అందుకే అడిగాను అంటాడు పానీపూరీ బాబాయి. మీ పెళ్లిలో కూడా పానీపూరీ బండి పెడతా అంటాడు. ఇంతలో రిషి కూడా వసుధారకు అదే చెబుతాడు. మనం పెళ్లి గురించి ఆలోచించాలి. పెద్దమ్మతో నేను మాట్లాడుతాను అంటాడు రిషి. చదువు కోసం నువ్వు పెళ్లి పీటల నుంచి వచ్చేశావు. నీ ధైర్యం గొప్పది. అదే ధైర్యంతో మీ ఇంట్లో వాళ్లను పెళ్లికి ఒప్పిస్తావని అనుకుంటున్నా. ఏం మాట్లాడవు ఏంటి వసుధార. మన పెళ్లికి మీ వాళ్ల వైపు నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటాయా? ఉండవనే అనుకుంటున్నా అంటాడు రిషి.

దీంతో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అంటుంది వసుధార. ఆడపిల్లకు పుట్టింటి వాళ్లు అండగా ఉంటారు. పుట్టింటి వాళ్లే బలం అంటారు. కానీ ఒక ఆడపిల్లగా తన తండ్రి చెప్పే పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు. మా నాన్న మంచోడే. ఆయన చెప్పిందే జరగాలంటారు. అందుకే నాన్నను ఎదురించలేదు. భర్త తప్పు చేసినా కూడా ఎదురించి మాడ్లాడకపోవడం అనే కుటుంబంలో మా అమ్మ పుట్టింది. జన్మనిచ్చిన తల్లిదండ్రులను విమర్శించడం కరెక్ట్ కాదు కానీ.. మా అమ్మానాన్నలను నేను గౌరవిస్తాను అంటుంది.

ఒకటో రెండో అలవాట్లు మార్చుకుంటే మంచిదేమో. తను చెప్పిందే జరగాలనుకునే విచిత్ర మనస్తత్వాలు ఉన్న ఇద్దరు బావలు మా ఫ్యామిలీలోకి వచ్చారు. మా కుటుంబానికి వాళ్లు చేయాల్సిన నష్టం అంతా చేశారు అని అంటుంది వసుధార.

Guppedantha Manasu 12 Dec Today Episode : తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం రిషికి చెప్పిన వసుధార

మా అమ్మ.. మా అక్కల జీవితం లాగానే నా జీవితం కూడా నాశనం అవుతుందని భావించి నా జీవితాన్ని నేనే దిద్దుకోవాలని ధైర్యం చెప్పి పంపించింది. అమ్మ చెప్పిన దైర్యం నన్ను ఇప్పటికీ నడిపిస్తోంది.

ఎవరైనా అమ్మా, నాన్న అనే పదాలు పలికితే కంట్లోంచి నీళ్లు వస్తాయి. అందరినీ వదిలేసి వచ్చాను సార్. జగతి మేడమ్, మీ తోడు దొరికాక నా జీవితంలో లక్ష్యాన్ని సగం నెరవేర్చుకున్నాను. అక్కడే ఉంటే నా జీవితం అక్కడే ముగిసిపోయేది అంటుంది వసుధార.

నాన్న నేను గెలుచుకున్న ట్రోఫీని నేలకేసి కొట్టగలరు కానీ.. నా భవిష్యత్తును నేలకేసి కొట్టలేరు. ఎందుకంటే నా భవిష్యత్తును నేనే నిర్ణయించుకున్నాను. ఇప్పుడు చెప్పండి రిషి సార్. నేను ఏం చేయాలి.. ఎలా ఒప్పించాలి. ఈ ప్రశ్నకు నేను ఇప్పుడే సమాధానం చెప్పలేను సార్ అంటుంది వసుధార.

తను కన్నీళ్లు పెట్టుకుంటుంటే.. తనకు ఖర్చీఫ్ ఇస్తాడు రిషి. దీంతో దాన్ని అలాగే చూస్తూ ఉంటుంది. ఈ ఖర్చీఫ్ అని అడుగుతుంది. దీంతో అవును.. కాకి ఎంగిలి చేసిన ఖర్చీఫే అంటాడు.

వసుధార.. నువ్వు నాకు అందించిన అందమైన మెమోరీస్ కు ఎప్పటికీ మరకలు అంటనివ్వను అంటాడు రిషి. తర్వాత మినిస్టర్ దగ్గరికి వెళ్లారు ఇద్దరూ. మిషన్ ఎడ్యుకేషన్ గురించి మీకు ఒక విషయం చెప్పడానికి పిలిచాను అంటాడు మినిస్టర్.

ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో తను మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కు హెడ్ గా ఉండలేనని మెయిల్ చేశారు అని చెబుతాడు. తనకు బదులుగా ఆ స్థానంలో వసుధారను నియమించమని సూచన చేశారు అంటాడు మినిస్టర్.

సర్ నేనా అంటుంది వసుధార. జగతి మేడమ్ తన ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పారు. ఈ విషయంలో మనం ఏం అడ్డు చెప్పలేం కదా అంటాడు మినిస్టర్. ఇక ముందు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టును వసుధార చూసుకుంటుందని జగతి.. తన దగ్గరికి వచ్చిన లెక్చరర్లతో అంటుంది జగతి.

సార్ నేను ఇంత పెద్ద బాధ్యతను మోయలేను అంటుంది వసుధార. దీంతో మోసేదాన్నే బాధ్యత అంటారు. బాధ్యత ఎప్పుడూ కాస్త బరువుగానే ఉంటుంది అంటాడు. సార్ వసుధార చేయగలదు అంటాడు రిషి.

జగతి మేడమ్ గైడెన్స్ లో తను చేస్తుంది. మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం అంటాడు రిషి. వసుధారను మించిన సమర్థత గలవారు నాకైతే కనిపించడం లేదు అంటాడు మినిస్టర్. లెక్చరర్లు కూడా అదే అడుగుతారు జగతిని.

మనకు వసుధార తప్ప వేరే ఆప్షన్ లేదు అంటుంది జగతి. కట్ చేస్తే రాత్రి పూట అందరూ మాట్లాడుతారు. నువ్వు కాదనకు అని ఫణీంద్రా కూడా అంటాడు. దీంతో జగతి మేడమ్ సూచనలతో ఇన్నేళ్లు రన్ చేశాం. ఏదో అక్కడక్కడా నా ఆలోచనలు పెట్టాం కానీ.. జగతి మేడమ్ ప్లేస్ ను రీప్లేస్ చేసేంత గొప్పదాన్న కాదు అంటుంది వసుధార.

ఇంతలో జగతి దగ్గరికి వసుధార వస్తుంది. మిషన్ ఎడ్యుకేషన్ ను నేను నడపగలనా. మీరు పక్కన ఉంటే ఆ ధైర్యం వేరు. సర్వే చేస్తా కానీ.. బాధ్యత మొత్తం నన్నే చూసుకో అంటే ఇప్పుడే టెన్షన్ మొదలైంది అంటుంది వసుధార.

అయినా కూడా వసుధారను ఒప్పిస్తుంది జగతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది