Guppedantha Manasu 22 Nov Today Episode : రిషి కాలేజీలోనే ప్రొఫెసర్ గా జాయిన్ అయిన వసుధార.. ఇద్దరి ప్రేమకు లైన్ క్లియర్ అయినట్టేనా? మహీంద్రా తిరిగి రిషి దగ్గరికి వస్తాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Guppedantha Manasu 22 Nov Today Episode : రిషి కాలేజీలోనే ప్రొఫెసర్ గా జాయిన్ అయిన వసుధార.. ఇద్దరి ప్రేమకు లైన్ క్లియర్ అయినట్టేనా? మహీంద్రా తిరిగి రిషి దగ్గరికి వస్తాడా?

 Authored By gatla | The Telugu News | Updated on :22 November 2022,9:00 am

Guppedantha Manasu 22 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 నవంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 614 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధారను రిషి సత్కరిస్తాడు. శాలువా కప్పాక తన మెడలో దండ వేయబోతాడు. ఇంతకుముందు తనకు వసుధార దండ వేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. సర్.. దండ వేయండి అంటుంది వసుధార. దీంతో తన మెడలో దండ వేస్తాడు రిషి. దీంతో అందరూ చప్పట్ల మోత మోగిస్తారు. ఇక మీరు ఇంటర్వ్యూను మొదలుపెట్టండి అని జగతి మీడియా వాళ్లతో అంటుంది. దీంతో ఈ ఇంటర్వ్యూ సమయంలో జగతి మేడమ్, రిషి సార్ నా పక్కనే ఉండాలని కోరుతుంది వసుధార. దీంతో సరే అంటారు. ఇక ఇంటర్వ్యూ ప్రారంభం అవుతుంది. మేడమ్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా అంటే ఒక్క నిమిషం అని చెప్పి జగతి మేడమ్ ఆశీర్వాదం తీసుకుంటుంది వసుధార.

guppedantha manasu 22 november 2022 full episode

ఆ తర్వాత ముగ్గురూ కూర్చొంటారు. యూనివర్సిటీ టాపర్ గా వస్తారని మీరు ముందుగానే ఊహించారా? అని ప్రశ్నిస్తారు మీడియా వాళ్లు. దీంతో నా విజయాన్ని నాకంటే ముందు ఇద్దరు ఊహించారు. వాళ్లకే నా విజయంలో పాత్ర ఎక్కువ. ఆ ఇద్దరూ ఎవరో కాదు.. నన్ను నడిపించిన జగతి మేడమ్, నాలో ధైర్యం నింపిన రిషి సార్. ఈ ఇద్దరూ లేకపోతే నాకు విజయమే లేదు అంటుంది వసుధార. మీ కుటుంబ నేపథ్యం చెప్పండి అంటే మాది పల్లెటూరు. అమ్మ, నాన్న, అక్కయ్యలు, తమ్ముడు. ఇది నా కుటుంబం. జీవితం మీద ఎన్నో ఆశలు, ఎన్నో కలలతో డీబీఎస్టీ కాలేజీకి వచ్చాను అని చెబుతుంది. ఇంటిని, కుటుంబాన్ని ఊరిని కూడా వదిలేసి ఒంటరిగా ఇక్కడికి చేరాను అంటుంది. పార్ట్ టైమ్ జాబ్ లు చేసుకుంటూ చదువుకున్నాను. చివరికి నా కష్టానికి ఫలితం దక్కింది.

ప్రతి విజయానికి మూడు సూత్రాలు ఉన్నాయంటారు. మొదటిది శ్రమ, రెండోది శ్రమ, మూడోది శ్రమ అంటుంది వసుధార. కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, ఆటుపోట్లు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి.. అంటుంది వసుధార. అన్నింటినీ భరించాలి. అవసరమైన చోట ఎదిరించాలి అంటూ మరో ప్రశ్నకు సమాధానం చెబుతుంది వసుధార.

అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అంటుంది. ఈ విజయం తర్వాత మీ భవిష్యత్తు ఆలోచన ఏంటి. విదేశాలకు వెళ్లి చదువుతారా అని అడిగితే.. నేను ఎక్కడికీ వెళ్లను. ఇక్కడే ఉంటాను అంటుంది. ఏదైనా పెద్ద ఉద్యోగంలో స్థిరపడతారా? అంటే అవును.. పెద్ద ఉద్యోగంలోనే స్థిరపడతాను. పిల్లలకు పాఠాలు చెప్పే పని అంటుంది వసుధార.

ఈ సమాజంలో డాక్టర్, సైంటిస్ట్, ఇంజనీర్, సాఫ్ట్ వేర్.. ఇలా ఏ రకమైన ఉద్యోగమైనా ఎంత వారినైనా తయారు చేసేది టీచర్ మాత్రమే అంటుంది వసుధార. అలాంటి పాఠాలు చెప్పే ఉద్యోగంలోనే నేను స్థిరపడతాను అంటుంది. రిషి సార్ మీ కాలేజీ స్టూడెంట్ యూనివర్సిటీ టాపర్ గా వచ్చినందుకు మీకు ఎలా ఉంది అని అడుగుతారు.

Guppedantha Manasu 22 Nov Today Episode : వసుధారను మెచ్చుకున్న రిషి

వసుధార ప్రయాణం.. వసుధార విజయం అందరికీ ఆదర్శం. మాట్లాడాల్సింది చాలా ఉంది కానీ.. ఈ వేదిక, సందర్భం అంత కరెక్ట్ కాదు. వసుధార అందరికీ ఆదర్శంగా నిలిచింది. తన జీవితంలో కూడా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటాడు రిషి.

వసుధార నువ్వు ఈ కాలేజీకే కాదు.. నాకు కూడా ఎంతో ముఖ్యం అని అందరి ముందు చెప్పాలనిపిస్తోంది అంటాడు రిషి. దీంతో వద్దు సార్.. ఇది సరైన సందర్భం కాదు అంటుంది వసుధార. ఈ శుభ సందర్భంలో ఒక సెల్ఫీ తీసుకుందాం అని అంటాడు.

అందరూ వస్తారు. ఆ తర్వాత గౌతమ్ చాలు ఇక అంటాడు. ఆ తర్వాత మహీంద్రా మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుంటాడు. అతడిని రిషి గమనిస్తాడు. వెంటనే మహీంద్రా దగ్గరికి వెళ్లి.. డాడ్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. నన్ను వదిలి మీరు ఎక్కడికీ వెళ్లొద్దు అంటాడు.

ఇంతలో మీడియా వాళ్లు వచ్చి జరిగిన ఘటన మాకు చాలా బాధ అనిపించింది. అందరి తరుపున మీకు సారీ చెబుతున్నాను అంటాడు. ఇంతలో మహీంద్రా అక్కడి నుంచి వెళ్లిపోతూ జగతికి సైగ చేస్తాడు. దీంతో జగతి కూడా వెళ్లిపోయేందుకు రెడీ అవుతుంటుంది. మేడమ్ వచ్చినందుకు థాంక్స్ అంటాడు.

డాడ్ నాకు దూరం అవడం చాలా బాధ అనిపించింది. డాడ్ ఏ విషయంలో నా మీద కోపం పెంచుకున్నాడో నాకు అర్థం కావడం లేదు. డాడ్ నాతోనే ఉండాలి. మనింట్లోనే ఉండాలి. ఈ విషయంలో మీరు కూడా నాకు సాయం చేయాలి అంటాడు. దీంతో సరే రిషి అంటుంది.

పదండి డాడ్ దగ్గరిక వెళ్దాం అంటాడు రిషి. దీంతో సరే అంటుంది జగతి. ఇంతలో పుష్ప వచ్చి సెల్ఫీ అంటుంది. దీంతో జగతి కూడా తప్పించుకొని వచ్చేస్తుంది. ఇద్దరూ వెళ్లబోతుండగా వచ్చి ఆపుతాడు రిషి. డాడ్.. మీతో మాట్లాడాలి డాడ్ అంటాడు. దీంతో సరే అంటాడు మహీంద్రా.

మరోవైపు దేవయానికి చాలా కోపం వస్తుంది. మహీంద్రా, జగతి ఎందుకు కాలేజీకి వచ్చారని చాలా కోపం వస్తుంది. రిషిని మాత్రం ఈ విషయాలు అడగకు అంటాడు రిషి పెదనాన్న. ఏం జరిగిందని మీరు ఎందుకు వెళ్లారని నేను అడగను. మిమ్మల్ని దూరం చేసుకొని మీరు లేని రిషి ఎలా ఉంటాడు… ఆ బాధ ఎలా ఉందో నాకు మాత్రమే తెలుసు అంటాడు రిషి.

మీరు ఎప్పుడూ నాతోనే ఉండాలి డాడ్ అంటాడు రిషి. అయినా కూడా మహీంద్రా వినడు. శిక్ష నీకు వేశాను అని నువ్వు అనుకుంటున్నావు. నాకు నేనే శిక్ష విధించుకున్నానని నేను అనుకుంటున్నాను అంటాడు మహీంద్రా. ఈరోజు ఆలోచించుకోండి.

మీ మనసు ఏది చెబితే అది చేయండి. రేపు ఉదయం వరకు వచ్చేయండి అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది