Hanuman Movie : బాహుబలి రేంజ్‌లో తీశాడు ప్రశాంత్ వర్మ.. హనుమాన్ మూవీ పబ్లిక్ టాక్..!
Hanuman Movie : హనుమాన్ మూవీ రివ్యూ | Hanuman Movie Review | తేజా సజ్జా హీరోగా Teja Sajja ప్రశాంత్ వర్మ Prashanth Varma దర్శకత్వంలో తెరకెక్కిన ‘ హనుమాన్ ‘ మూవీ Hanuman Movie ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్స్ అద్భుతంగా ఆకట్టుకోవడంతో మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ విధంగానే సినిమా ఈరోజు విడుదలైంది. హనుమాన్ సినిమా […]
ప్రధానాంశాలు:
Hanuman Movie : బాహుబలి రేంజ్‌లో తీశాడు ప్రశాంత్ వర్మ.. హనుమాన్ మూవీ పబ్లిక్ టాక్..!
Hanuman Movie : హనుమాన్ మూవీ రివ్యూ | Hanuman Movie Review | తేజా సజ్జా హీరోగా Teja Sajja ప్రశాంత్ వర్మ Prashanth Varma దర్శకత్వంలో తెరకెక్కిన ‘ హనుమాన్ ‘ మూవీ Hanuman Movie ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్స్ అద్భుతంగా ఆకట్టుకోవడంతో మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ విధంగానే సినిమా ఈరోజు విడుదలైంది. హనుమాన్ సినిమా చూసిన పబ్లిక్ ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలో చాలా సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని అంటున్నారు. డ్రామా, ఎమోషన్స్, వీఎఫ్ఎక్స్, మైథాలజీ అన్ని విధాలుగా సినిమా ఆకట్టుకుందని అంటున్నారు. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ అదుర్స్ అనిపించేలా ఉందని అంటున్నారు.
సెకండ్ హాఫ్ లో వరలక్ష్మి శరత్ కుమార్, తేజ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటాయని, అక్క తమ్ముడు అంటే వీళ్ళలాగే ఉంటారని అనిపిస్తుంది అని అంటున్నారు. హీరో తేజా సజ్జా నటన మరో లెవెల్లో ఉందంటున్నారు. సినిమా భారాన్ని మొత్తం తన భుజాల మీద మోసాడు అంటున్నారు. ప్రశాంత్ వర్మ కథను నడిపించిన తీరు అద్భుతం అంటున్నారు. స్పెషల్ ఎఫెక్ట్స్ డైరెక్షన్ క్లియర్గా కనబడుతుంది అంటున్నారు. చాలా సన్నివేశాలు సింపుల్ గా కనిపిస్తాయంటున్నారు. వరలక్ష్మి తను నటనతో బాగా ఆకట్టుకుందంటున్నారు. మిగతా నటీనటులు కూడా చక్కగా చేశారంటున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడని చెబుతున్నారు. వినయ్ రామ్, సముద్రఖని నటన కూడా చాలా బాగుందని అంటున్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయం అంటున్నారు.
ఆదిపురుష్ సినిమాలో కూడా హనుమాన్ ని ఇంత నీట్ గా చూపించలేదని పబ్లిక్ అంటున్నారు. హనుమాన్ గురించి చాలా అద్భుతంగా చూపించారని, హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు కూడా చక్కగా ఉంటాయని, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంతో హ్యాపీగా ఈ సినిమాని చూడవచ్చు అని అంటున్నారు. హనుమాన్ సినిమా వండర్ఫుల్ కాన్సెప్ట్ అని అంటున్నారు. విలన్ పాత్ర కూడా బాగుందని అంటున్నారు. ఈ సినిమాలో కామెడీ కూడా ఉందని, ప్రేక్షకులు ఆ కామెడీకి కచ్చితంగా నవ్వుకుంటారని, పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటాయని, లాస్ట్ లో హనుమాన్ ని చూపించే విధానం అద్భుతంగా ఉందని, పండగ బ్లాక్ బస్టర్ హనుమాన్ సినిమా అని పబ్లిక్ చెబుతున్నారు.