కత్రినా ఈ ఒక్క సినిమా చేస్తే ఇక బాలీవుడ్ లో హీరోలందరు ఔట్ ..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

కత్రినా ఈ ఒక్క సినిమా చేస్తే ఇక బాలీవుడ్ లో హీరోలందరు ఔట్ ..!

ప్రముఖ నిర్మాతగా.. దర్శకుడిగా…కథా రచయితగా బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించారు అలీ అబ్బాస్ జాఫర్. కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో సుల్తాన్, టైగర్ జిందాహే, భరత్ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకొని బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌ సాధించడంతో…క్రేజీ డైరెక్టర్‌గా మారాడు. ప్రతి సినిమాకి ఓ వేరియేషన్‌ను చూపిస్తూ వస్తున్న ఈ డైరెక్టర్ లేటెస్ట్‌ గా కత్రినా […]

 Authored By govind | The Telugu News | Updated on :9 December 2020,12:18 pm

ప్రముఖ నిర్మాతగా.. దర్శకుడిగా…కథా రచయితగా బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించారు అలీ అబ్బాస్ జాఫర్. కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో సుల్తాన్, టైగర్ జిందాహే, భరత్ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకొని బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌ సాధించడంతో…క్రేజీ డైరెక్టర్‌గా మారాడు. ప్రతి సినిమాకి ఓ వేరియేషన్‌ను చూపిస్తూ వస్తున్న ఈ డైరెక్టర్ లేటెస్ట్‌ గా కత్రినా హీరోగా ఓ చిత్రాన్ని తీయబోతున్నాడు. ఇదే షాకింగ్ విషయం. ఏంటి కత్రినాను హీరో అని. కత్రినా నే హీరోగా నాయికా ప్రధాన సినిమాను ప్రయోగాత్మకంగా రూపొందించనున్నారు.

Tiger Zinda Hai Movie - Video Songs, Movie Trailer, Cast & Crew Details | YRF Yash Raj Films

ఆ రకంగా ఈ సినిమాకు కూడా కత్రినా ఫేమ్‌కు తగ్గట్లుగానే సూపర్‌ సోల్జర్ అని పేరు పెట్టారు. బాలీవుడ్‌లో మహిళా స్టార్ నటిస్తున్న తొలి సూపర్ స్టార్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు. ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడంతో…కత్రినా కైఫ్ అభిమానులు ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం సూపర్ సోల్జర్ సినిమా షూటింగ్‌కు సంబంధించి ప్రీ పొడక్షన్ పనులు సాగుతున్న్నాయి. ఏ ఏ లొకేషన్‌లలో సినిమా తీస్తే…బాగుంటుందో తెలుసుకునేందుకు …చిత్ర యూనిట్ ఇప్పటికే రీసెర్చ్ ను మొదలు పెట్టేసింది. ఇక ఇందులో భాగంగా అలీ అబ్బాస్‌ దుబాయ్ వెళ్లారని బాలీవుడ్ సినీ వర్గాల టాక్.

BHARAT | Official Trailer | Salman Khan | Katrina Kaif | Movie Releasing On 5 June 2019 - YouTube

సినిమా మొత్తం దాదాపు అబుదబి, దుబాయ్, పోలాండ్, జార్జియా, ఉత్తరాఖండ్ లలో షూటింగ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు. సూపర్ సోల్జర్ టైటిల్ కి తగ్గట్లుగానే…ఇందులో హీరోగా కత్రినా నటిస్తోంది. ఈ సినిమాకు హీరో అవసరం లేదని ఇప్పటికే దర్శకుడు ఓ ప్రముఖ పత్రికకు తెలిపాడు…దీనిని బట్టి చూస్తే గత చిత్రాల మాదిరిగా ఈ మూవీలో రొమాంటిక్ సన్నివేశాలు ఉండవని హింట్ ఇచ్చాడు అలీ. కత్రినా తో ఇప్పటికే రెండు సినిమాలు తీశాలు అలీ. అవి సూపర్ హిట్ సాధించాయి… మేరే బ్రదర్ కి దుల్హన్…టైగర్ జిందా హై సినిమాల తరువాత సూపర్ సోల్జర్ వీరిద్దరి కాంబినేషన్‌లోని మూడో చిత్రం. కాబట్టి భారీ లెవల్ లో ప్లాన్ చేస్తున్నాడు. బాలీవుడ్ లో కత్రినా కైఫ్ ఈ ఒక్క సినిమా చేస్తే ఇక బాలీవుడ్‌లో హీరోలందరూ ఔట్ అని సినీ వర్గాలు చెప్పుకుంటున్నారట.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది