Jr NTR : వెయిట్ లాస్ అయితేనే.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తానన్న డైరెక్టర్ ఎవరో తెలుసా?
Jr NTR : టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ పిక్చర్‌తో పాన్ ఇండియా స్టార్ అయిపోతారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సంగతి అలా ఉంచితే.. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కాస్త సన్నగా సిక్స్ ప్యాక్‌లో ఆకర్షణీయంగా కనబడుతున్నారు. కానీ, ఒకప్పుడు తారక్ చాలా లావుగా ఉన్నాడు. ‘రాఖీ’ సినిమా టైంలోని తారక్‌కు ఇప్పటి తారక్‌కు వెయిట్, అప్పియరెన్స్ విషయంలో చాలా తేడా ఉంటుంది. కాగా, తారక్‌ను వెయిట్ లాస్ అయితేనే ఓ సినిమా చేస్తానని చెప్పాడట ఓ స్టార్ డైరెక్టర్. ఆయన ఎవరంటే..జూనియర్ ఎన్టీఆర్..రాజమౌళి కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చిన సంగతి అందరికీ విదితమే.
‘స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ’ ఈ చిత్రాలు బాక్సాఫీసును షేక్ చేశాయి. ప్రజెంట్ ‘ఆర్ఆర్ఆర్’ రాబోతున్నది. కాగా, ఎన్టీఆర్‌తో రాజమౌళి ‘యమదొంగ’ మూవీ చేసే సమయంలో ఓ కండీషన్ పెట్టాడట. అదే వెయిట్ లాస్ కండీషన్.. ‘యమదొంగ’ సినిమా చేయడానికి ముందర తారక్బాగా బొద్దుగా ఉండే వాడు. అయితే, అంత లావుగా ఉన్నప్పటికీ తారక్ బాగా డ్యాన్స్ చేశేవాడు. అయితే, ‘యమదొంగ’ ఫిల్మ్ స్టోరి వినిపించిన తర్వాత వెయిట్ లాస్ అయితేనే సినిమా చేస్తానని తారక్‌కు దర్శకధీరుడు రాజమౌళి చెప్పారట.
Jr NTR : జూనియర్ ఎన్టీఆర్‌కు సూటిగ్ ఆ లావు విషయం చెప్పిన డైరెక్టర్..
అంతే ఇక.. టాలీవుడ్ జక్కన్న చెప్పిన మాట విన్న.. తారక్.. వెయిట్ లాస్ అయ్యేందుకుగాను ఒప్పుకున్నాడు. ఏకంగా 30 కిలోలు వెయిట్ లాస్ అయ్యాడు. అలా సినిమా స్టార్ట్ అయింది. ఇకపోతే తను వెయిట్ పోయినట్లుగానే తనకున్న దరిద్రం కూడా పోయిందని తారక్ ఆ టైంలో ఇంటర్వ్యూల్లో పేర్కొనడం గమనార్హం. మొత్తంగా తారక్ సినిమా కోసం వెయిట్ లాస్ అయ్యాడన్న సంగతి అందరికీ ఈ సందర్భంగా తెలిసి ఉంటుంది. ఇకపోతే తారక్ ‘ఆర్ఆర్ఆర్’ పిక్చర్ తర్వాత చేయబోయే సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే అవుతుండటం విశేషం. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ చిత్రం చేయబోతున్నారు.