Varun Tej – Lavanya Tripathi : వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీల మధ్య ప్రేమ పుట్టించింది ఇతడే ..?
Varun Tej – Lavanya Tripathi : ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ గురించి వార్తలు వస్తున్నాయి. మనకు తెలిసిందే వీరిద్దరూ మిస్టర్ సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లిదాకా వెళ్ళినట్లు సమాచారం. దీంతో త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈనెల 9వ తేదీ ఇరు కుటుంబాల సమక్షంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కావలసిన పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయని, ఇండస్ట్రీలోని పెద్దవాళ్ళకి ఆహ్వానం కూడా వెళ్లినట్లు టాక్.
ఈ క్రమంలోనే వీరిద్దరి ప్రేమకు సంబంధించిన కొన్ని మీమ్స్, న్యూస్ తెగ వైరల్ అవుతున్నాయి. అయితే లావణ్య, వరుణ్ ల మధ్య ప్రేమకు కారణం ప్రముఖ డైరెక్టర్ శ్రీనువైట్ల అంట. 2017లో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మిస్టర్ సినిమాలో లావణ్య వరుణ్ కలిసి నటించారు. ఈ సినిమా సమయంలోనే లావణ్య మధ్య ప్రేమ పుట్టినట్లు తెలుస్తోంది. ఈ రకంగా వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి శ్రీను వైట్లనే కారణమని సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. శ్రీను వైట్లకు వారి ప్రేమకు ఎలాంటి సంబంధం లేకపోయినా కామెడీ కోసం ఆయనను వాడేస్తున్నారు.
ఇకపోతే వరుణ్ తేజ్ హ్యాండ్సఫ్ సినిమాతో బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత ‘ ముకుంద ‘ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తు వస్తున్నాడు. ఇటీవలే వరుణ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమాలో నటించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయబోతున్నాడు. మెగా ప్రిన్స్ గా వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతి తక్కువ టైంలోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.