Intinti Gruhalakshmi 04 August 2022 Episode : నందుకి సామ్రాట్ ఊహించని ట్విస్ట్.. దిక్కుతోచని పరిస్థితిలో లాస్య..!
Intinti Gruhalakshmi 04 August 2022 Episode : నందు రా వంటలు మొదలు పెడదామని సామ్రాట్ పిలుస్తాడు.. మొదటిసారి నందు చెఫ్ గెటప్ లో భలే ఉంటాడు.. నందుని చెఫ్ గెటప్ లో చూసి తులసి ఆశ్చర్య పోతుంది.. అంతేకాదు ఇన్నాళ్టికి తన విలువ తెలిసి వచ్చినట్లు ఫీల్ అవుతుంది తులసి.. నందు మాత్రం తులసివైపు సీరియస్ గా కోపంగా చూస్తాడు.. లాస్య నందుని చూస్తూ పాపం నా వల్ల అనవసరంగా నందు ఇరుక్కుపోయాడు.. నందుని ఎలాగోలా ఈ ప్రాబ్లం నుంచి బయటపడేయాలి అని అనుకుంటుంది లాస్య..పార్టీ అంటే ఏదో తిన్నామా.. వచ్చామా.. వెళ్ళామా అన్నట్టు ఉంటుంది అనుకున్నాను..
కానీ ఇంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందని అనుకోలేదు.. సూపర్ అని నందు నీ చూసి పరంధామయ్య అంటాడు.. ఎవరెవరు ఏ డి విశేషాలు చేయాలో డిసైడ్ అయ్యాం కాబట్టి ఇక స్టార్ట్ చేద్దామా అని సామ్రాట్ అంటాడు.. వెంటనే వాళ్ళ బాబాయ్ లక్కిని చూస్తూ రేయి బుడ్డోడా ఒక విజిల్ వెయ్యి స్టార్ట్ చేద్దాం అని అంటాడు.. ఇక అందరూ క్లాస్ కొట్టి నందు అభి అంకిత టీం ఒకవైపు.. సామ్రాట్, ప్రేమ్ దివ్య ఒక టిమ్.. నందుకి లాస్య సపోర్ట్ చేస్తే.. సామ్రాట్ కి తులసి సపోర్ట్ చేస్తుంది.. ఇలా వాళ్ళిద్దరూ దగ్గరా అవ్వడంతో నందు విసుగ్గా ఉంటాడు.. ఇక నందు ఆ కోపంతో వంటలు పైన పడి కింద పడి ఎలా గోలా ఫినిష్ చేస్తారు..దివ్య సామ్రాట్ తో కలిసి చెస్ ఆడతారు.. ఆ చెస్ అడటం ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళిద్దరూ ఆసక్తిగా చూస్తారు..
సామ్రాట్ చెక్ పెట్టగా కి దివ్య కూడా పైఎత్తులు వేస్తూ ఓడించడానికి ప్రయత్నిస్తుంది.. తులసి సామ్రాట్ దగ్గరవడం చూసిన నందు కోపంతో రగిలిపోతాడు.. నందు కోపంగా అక్కడి నుంచి బయటకు వచ్చేయడం చూసిన లాస్య ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతుంది.. ఏట్లోకి అని కోపంగా ఉంటాడు నందు.. సందు దొరికింది కదా అని ఆ సామ్రాట్ తులసితో సరదాగా చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అని అంటాడు.. దాంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు.. కానీ లాస్య ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అనవసరంగా నువ్వే సామ్రాట్ కి కావాలని హింట్ ఇచ్చినట్టు అవుతుంది.. మర్యాదగా ఇంట్లోకి రమ్మని రిక్వెస్ట్ చేస్తుంది లాస్య.. ఆ ప్రాజెక్టు కోసం ఇదంతా భరించమని అంటుంది లాస్య..
నందు చేసిన వంటలు ఒకవైపు సామ్రాట్ చేసిన వంటలు మరోవైపు.. ఈ వంటలను టేస్ట్ చేయమని తులసి లాస్యల్లో అడగగా తులసి ఇప్పుడు మేము ఈ వంటలు టేస్ట్ చేయడం కరెక్ట్ కాదు.. అందుకు మా అత్తయ్య మావయ్యలు బెస్ట్ అని అంటుంది .. ఇక వాళ్ళిద్దరూ వంటల్లో టేస్ట్ చేసి కచ్చితంగా నందు పేరే అనౌన్స్ చేస్తారు అని లాస్య అనుకుంటుండగా.. సామ్రాట్ వంటలు ది బెస్ట్ అని సర్టిఫై చేస్తారు.. సో వాళ్ళ అమ్మానాన్నలే నందుని తీసి పక్కన పడేస్తారు.. అంతలో హనీ మా డాడీ వన్ హ్యాండ్ బాగా ఆడతాడు అని అంటుంది.. వెంటనే లాస్య కూడా మా నందు కూడా అందులో ఛాంపియన్ అని అంటుంది.. అలాంటప్పుడు ఇద్దరికీ పోటీ ఎందుకు నిర్వహించకూడదు అని హనీ లక్కీ అంటారు.. నందు సరే అని అంటాడు. సామ్రాట్ ఇది సరైన సమయం కాదు అని అంటాడు.. లేదు డాడీ నువ్వు ఆడాల్సిందే అని ఒత్తిడి చేయగా సామ్రాట్ ఒప్పుకుంటాడు.. ఇక రేపటి ఎపిసోడ్లో ఇద్దరూ ఎవరి బల్ల బలాలు వారు చూపిస్తుండగా… తులసి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతోంది.. అది గమనించిన సామ్రాట్ కావాలని తులసి కోసం ఓడిపోతాడా లేదా గెలుస్తాడా అనేది ట్విస్ట్..