Intinti Gruhalakshmi 11 Sep Today Episode : శృతికి తన మనసులోని మాటను చెప్పిన ప్రేమ్.. అందరి ముందు ప్రేమ్ అంటే ఇష్టం లేదని తేల్చి చెప్పిన శృతి.. నందు, లాస్య ప్లాన్ వర్కవుట్ అయినట్టేనా?
Intinti Gruhalakshmi 11 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 11 సెప్టెంబర్ 2021, శనివారం తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం. తులసి.. ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు.. అని అడుగుతాడు తన మామయ్య. శృతిని కలవడానికి ప్రేమ్ వెళ్లాడు మామయ్యా.. అందుకే ఎదురు చూస్తున్నాను.. అంటుంది తులసి. శృతి మనసులో ఏముందో.. ప్రేమ్ గురించి ఏమనుకుంటుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు అంటుంది తులసి. ఇందులో అర్థం కావడానికి ఏముంది.. ప్రేమ్ బంగారం.. వాడిని పెళ్లి చేసుకునే వాళ్లు అదృష్టవంతులు. శృతికి ప్రేమ్ ప్రేమ విషయం తెలియదా. ఒకప్పుడు కూడా ఇద్దరూ ఒకరిని మరొకరు ప్రేమించుకున్నారు కదా.. అని అంటాడు తన మామయ్య. ఏమైతుందో ఏమో.. శృతి.. ప్రేమ్ ప్రేమను ఒప్పుకుంటుందో లేదో అని టెన్షన్ పడుతుంది తులసి.

intinti gruhalakshmi 11 september saturday 422 episode highlights
కట్ చేస్తే.. ప్రేమ్ గుడికి వస్తాడు. ఆత్రంగా గుళ్లోకి వెళ్తాడు. శృతికి కోసం వెతుకుతుంటాడు. ప్రేమ్ కు దూరంగా ఉంటానని.. ప్రేమ్ జీవితంలోకి రానని అంకుల్ కు మాట ఇచ్చాను కానీ.. ప్రేమ్ కు ఎలా దూరంగా ఉండాలని తనలో తానే అనుకుంటుంది శృతి. ఇప్పుడు నేను ఏం చేయాలి. ప్రేమ్ ప్రేమిస్తున్నాడని తెలిసి.. సంతోషపడాలా.. లేక బాధపడాలా.. తన మనసులోని మాటను ఇప్పుడు ప్రేమ్ చెబితే ఏం చేయాలి? అని తెగ మధనపడుతుంటుంది శృతి.
ఇంతలో ప్రేమ్.. శృతిని చూస్తాడు. చూసి.. తన దగ్గరికి వెళ్తాడు. శృతి అంటాడు. నువ్విక్కడున్నావా.. నీకోసం గుడి అంతా వెతుకుతున్నా అంటాడు. ఎందుకు అనగానే.. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి అంటాడు. ఈ విషయం చెప్పడానికి నాకు ఈ గుడి బెస్ట్ అనిపించింది అందుకే.. ఇక్కడికే వచ్చేశాను.. అని అంటాడు. దయచేసి నన్ను ఇష్టపడుతున్నాననే విషయం మాత్రం చెప్పకు.. అని లోలోపల అనుకుంటుంది.
Intinti Gruhalakshmi 11 Sep Today Episode : శృతికి ప్రేమ విషయం చెప్పిన ప్రేమ్
నీకర్థం అయిపోయిందా? నాకు తెలిసిపోయింది. నీకు అర్థం అయిపోయింది. అయినా నువ్వెందుకు అలా ముఖం చాటేస్తున్నావు. కాలం చాలా విచిత్రమైనది. నిన్ను ఎందుకు నాకు పరిచయం చేసిందో ఇప్పుడు తెలిసింది. నువ్వు నాకొక అమాయకమైన అమ్మాయిగా పరిచయం అయ్యావు. కానీ.. ఆ అమాయకం ఎంతగా నచ్చిందో తెలుసా. నీ అమాయకమైన వ్యక్తిత్వం కోసమే నిన్ను మాటిమాటికి కలిచేవాడిని. నీతో కాసేపు స్పెండ్ చేసినా నాకు బాగా నచ్చేవి. రోజుకు ఒక్కసారి అయినా నీతో చూడాలి.. అనిపించేంత. నాలాగే నీకు కూడా అనిపిస్తుందా.. అని అడుగుదామనుకున్నా కానీ.. అడగలేకపోయా. నీ గురించి ఆలోచిస్తేనే నాకు ఏదో మంచి ఫీలింగ్.. వస్తుంది. నా మనసులోని భావాలను నీకు చెప్పేయాలని అనుకుంటున్నాను. అందుకే ఇక్కడికి వచ్చాను.. అంటాడు ప్రేమ్. కానీ.. లోపల మాత్రం వద్దు ప్రేమ్.. చెప్పొద్దు అని తనలో తాను అనుకుంటుంది శృతి.

intinti gruhalakshmi 11 september saturday 422 episode highlights
నా ఆరాటం నువ్వే. నా ఆనందం నువ్వే శృతి. ఐ లవ్ యూ.. అంటూ గట్టిగా చెప్పేస్తాడు ప్రేమ్. నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం శృతి. నీతో జీవితాంతం కలిసి జీవించాలని ఆశ పడుతున్నాను.. నా ప్రేమను అర్థం చేసుకుంటావు కదూ.. అని అంటాడు ప్రేమ్. ఏమైంది శృతి.. ఏం మాట్లాడటం లేదు అంటాడు. కానీ.. నేను నీకు ఏం చెప్పలేను ప్రేమ్. అవును అని చెప్పాలని ఉన్నా.. నాకు చెప్పే అవకాశం చేజారిపోయింది. నో అనే చెప్పేందుకు నోరు పెగలడం లేదు.. అని అనుకుంటుంది. ఏ మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతుంది శృతి. అయితే.. తనకు కొంచెం సమయం కావాలేమో అని అనుకుంటాడు ప్రేమ్.
Intinti Gruhalakshmi 11 Sep Today Episode : నందు కోసం వెయిట్ చేసిన లాస్య
కట్ చేస్తే.. నందు వెళ్లిన పని ఏమైంది.. అని అనుకుంటుంది లాస్య. నందు ఏంటి ఇంకా రాలేదు.. అని తెగ టెన్షన్ పడుతుంటుంది. ఇంతలోనే నందు వస్తాడు. ఏమైంది.. శృతి ఒప్పుకుందా.. అని అడుగుతుంది. ఏదో ఒకటి చెప్పు నందు.. ఏం చెప్పకపోతే.. నాకు ఎలా తెలుస్తుంది అంటుంది. ఒప్పుకుందా.. అంటే ఒప్పుకోక ఏం చేస్తుంది.. అని అంటాడు నందు.

intinti gruhalakshmi 11 september saturday 422 episode highlights
శృతి ఏమన్నది.. అనగానే ప్రేమ్ జోలికి వెళ్లను అని చెప్పింది. ఇక.. శృతి అడ్డు తొలిగిపోయిందే.. ప్రేమ్ నే అక్షరతో పెళ్లికి ఒప్పిస్తానని చెప్పింది అంటాడు. అయితే.. శృతి వద్దన్నా కూడా ప్రేమ్ ఊరుకోడు కదా.. ఎందుకు వద్దు.. అంటూ ప్రేమ్ తన వెంట పడతాడు కదా. తులసి కూడా గుచ్చి గుచ్చి అడుగుతుంది కదా. అందుకే.. ప్రేమ్ మాటలకు, తులసి అభిమానానికి కరిగిపోకుండా.. శృతిని ఒప్పించాలి.. అంటుంది లాస్య.
Intinti Gruhalakshmi 11 Sep Today Episode : ప్రేమ్, శృతిని చూసి ఏమైంది అని అడిగిన తులసి
ఇంతలోనే ప్రేమ్, శృతి ఇద్దరూ ఇంటికి వస్తారు. వాళ్లను చూసి తెగ సంతోషిస్తుంది తులసి. ఏరా.. ఏంటి అలా ఉన్నావు అంటే.. ఏం లేదు అంటాడు. నీ మనసులో మాట చెప్పావా.. అంటే చెప్పాను అంటాడు. ఏమన్నది అంటే ఏం అర్థం కావడం లేదు. అవునన్నదే కాదన్నదో తెలియని సందిగ్ధంలో ఉన్నా.. అంటాడు. నేను చెప్పినా కూడా తన నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. నేను చెప్పిన దానికి అవును అనలేదు కాదు అనలేదు.. అని అంటాడు. కానీ.. తను ఏం సమాధానం చెబుతుందోనని టెన్షన్ గా ఉందమ్మా.. అంటాడు.

intinti gruhalakshmi 11 september saturday 422 episode highlights
ప్రేమలో అవన్నీ సహజమే.. అమ్మాయి కదా.. తన మనసులో ఏముందో వెంటనే ఎలా చెబుతుంది. తన మనసులో ఏముందో నేనే తెలుసుకొని నీకు చెబుతాను సరేనా.. అని అంటుంది తులసి. దీంతో సరే.. అని వెళ్లిపోతాడు ప్రేమ్. మీ అందరి సమక్షంలో ప్రేమ్ నిర్ణయం ఏంటో నాకు తెలియాలి.. అని అడుగుతాడు నందు. వాడికి ఇష్టం లేదు అని చెప్పాక కూడా ఎందుకు వాడిని బలవంత పెడుతున్నారు అని అడుగుతుంది తులసి. నీ నిర్ణయం ఏంటో అందరి ముందు చెప్పు. ఈ పెళ్లికి ఒప్పుకో.. అంటాడు నందు. నాకు శృతి అంటే ఇష్టం నాన్న.. నేను శృతిని ప్రేమిస్తున్నాను అంటాడు ప్రేమ్. ఇక చాలు ఆపు ప్రేమ్ అంటుంది శృతి. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయి భాగం కోసం వెయిట్ చేయాల్సిందే.