Intinti Gruhalakshmi 23 Oct Today Episode : లాస్య పంపించిన రౌడీలకు షాకిచ్చిన తులసి.. ఆ తర్వాత హనీని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తులసి.. ఎక్కడికి వెళ్లిందో తెలియదు | The Telugu News

Intinti Gruhalakshmi 23 Oct Today Episode : లాస్య పంపించిన రౌడీలకు షాకిచ్చిన తులసి.. ఆ తర్వాత హనీని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తులసి.. ఎక్కడికి వెళ్లిందో తెలియదు

Intinti Gruhalakshmi 23 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 23 అక్టోబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 1082 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు ఏం భయపడకండి. మీరు పైకి వెళ్లి రూమ్ లాక్ చేసుకోండి. నేను అన్నీ చూసుకుంటా అని పరందామయ్య, అనసూయకు సర్దిచెబుతుంది తులసి. ప్లీజ్ నేను పిలిచేవరకు కిందికి రావద్దు అని వాళ్లకు చెప్పి పైకి పంపిస్తుంది తులసి. మరోవైపు […]

 Authored By gatla | The Telugu News | Updated on :23 October 2023,9:00 am

Intinti Gruhalakshmi 23 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 23 అక్టోబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 1082 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు ఏం భయపడకండి. మీరు పైకి వెళ్లి రూమ్ లాక్ చేసుకోండి. నేను అన్నీ చూసుకుంటా అని పరందామయ్య, అనసూయకు సర్దిచెబుతుంది తులసి. ప్లీజ్ నేను పిలిచేవరకు కిందికి రావద్దు అని వాళ్లకు చెప్పి పైకి పంపిస్తుంది తులసి. మరోవైపు జాను తన రూమ్ లో అలిగి కూర్చుంటుంది. మరోవైపు విక్రమ్ మొబైల్ లో గేమ్ ఆడుకుంటూ కూర్చొంటాడు. దీంతో జాను తండ్రికి కోపం వస్తుంది. వీడు పూర్తిగా మారిపోయాడు. చెప్తా వీడి పని అని మనసులో అనుకుంటాడు. ఒసేయ్.. నడువు తొందరగా అవతల.. జాను అన్నం తిననని అలిగింది. బతిమిలాడి తినిపించడానికి వెళ్తున్నాం అని చెబుతాడు. ఇంతలో దివ్య.. ఫ్రూట్స్ కోసి తీసుకొచ్చి విక్రమ్ కు తినిపిస్తుంది. దీంతో అతడికి కోపం పెరుగుతుంది. కోపంలో జాను రూమ్ లోకి వెళ్తాడు. బావ ఎక్కడ అని అడుగుతుంది. నువ్వు ముందు ఏదైనా తిను అంటారు. దీంతో తినకపోతే ఏమౌతుంది.. కళ్లు తిరిగి పడిపోతాను అంటే కదా. తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పిస్తారు అంతే కదా. నాకు బావ కావాలి అంటుంది జాను.

దీంతో అస్సలు వినదు. ముందు ఇడ్లీ తిను అంటే.. బావ ముద్దలు పెడితేనే నేను తింటా. ఎన్ని రోజులు అయినా ఇలాగే పస్తులతో పడుకుంటాను అంటుంది జాను. వెళ్లి ఈ మాట బావతో చెప్పండి.. తను మొండి అయితే నేను జగమొండి అని చెప్పండి అంటుంది జాను. దీంతో తన తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాదు. కోపంతో బయటికి వచ్చి.. దివ్య, విక్రమ్ ఇద్దరూ అన్యోన్యంగా ఉండటం చూసి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడికి వెళ్లి అల్లుడు అంటూ పిలుస్తాడు. దీంతో దివ్య అక్కడి నుంచి వెళ్లిపోబోతుండగా కూర్చో అంటూ లాగుతాడు విక్రమ్. నా కూతురు ప్రాణాలు కాపాడు అల్లుడు. నువ్వు తనను పట్టించుకోవడం లేదని అలిగింది. ఎంత బతిమిలాడినా తినడం లేదు.. అంటారు. దీంతో బెదిరిస్తోందా అంటే అది బెదిరింపు కాదు.. నీ మీద ప్రేమ, అభిమానం అంటారు. లాగి చెంప మీద కొట్టి తినిపించక ఇలా చేస్తున్నారేంటి అంటాడు విక్రమ్. కడుపు కాలితే అదే తింటుంది అంటాడు విక్రమ్. అయినా రెండు తినకపోతే వచ్చే నష్టం ఏం లేదు అంటారు. మీరు కూడా టెన్షన్ పడకండి. జానును పట్టించుకోకండి. చచ్చినట్టు దారిలోకి వస్తుంది అని ఆ ప్లేట్ తీసుకొని ఇడ్లీని దివ్య.. విక్రమ్ కు తినిపిస్తుంది.

intinti gruhalakshmi 23 october 2023 monday full episode

#image_title

Intinti Gruhalakshmi 23 Oct Today Episode : రౌడీలను తరిమికొట్టేందుకు తన తమ్ముడి సాయం తీసుకున్న తులసి

కట్ చేస్తే తులసి ఆ రౌడీలను ఎదుర్కునేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటుంది. ఇంతలో నందు ఫోన్ చేస్తాడు. ఇప్పుడు నందు ఫోన్ చేస్తున్నాడేంటి అని భయపడుతుంది. హలో అని ఎత్తుతుంది. అక్కడ ఏమైనా ప్రాబ్లమా అంటే.. ఏం లేదు అంటుంది తులసి. అంతా ఓకేనా… నువ్వేమైనా ప్రాబ్లమ్ లో ఉన్నావేమో అని భయం. అంతకంటే ఇంకేం లేదు. మరోలా అనుకోకు అంటాడు నందు. మీరు జాగ్రత్తగా వెళ్లి రండి అని చెప్పి ఎలాగోలా మేనేజ్ చేస్తుంది. దీంతో నందుకు ఏం చేయాలో అర్థం కాదు.

మరోవైపు పరందామయ్య, అనసూయ పై నుంచి కిందికి చూస్తారు. అసలు ఏం జరగోబోతుందో చెప్పడం అని భయపడతారు. మరోవైపు ఇంటి ముందు కుర్చీ వేసుకొని కర్ర పట్టుకొని కూర్చుంటుంది తులసి. తనకు తోడుగా రాములమ్మ ఉంటుంది. ఈరోజుతో అటో ఇటో తేలిపోవాలి అని అంటుంది తులసి. రాములమ్మ.. గొడవకు పోవడం, ఒంటికి బురద రాసుకోవడం ఒకటే అనుకున్నాను. పట్టించుకోకుండా ఉండటం నా పిరికితనం కాదు అంటుంది తులసి.

భరిస్తున్నాను కదా అని ఎక్కువగా బాధపెడితే ఎలా తిరగబడాలో తెలుసు. వెళ్లు.. వెళ్లి ఆ గేట్ ఓపెన్ చేసి పెట్టు అంటుంది తులసి. దీంతో రాములమ్మ షాక్ అవుతుంది. గేట్ తీసి పెట్టడం ఏంటి అంటే అటాక్ చేయడానికి వచ్చేవాళ్లకు ఆహ్వానం పంపాలి కదా. నా ధైర్యం ఏంటో వాళ్లకు చూపించాలి కదా. వెళ్లు.. వెళ్లి గేటు ఓపెన్ చేయి రాములమ్మ అంటుంది తులసి.

మరోవైపు నందుకు అరవింద్ పీఏ ఫోన్ చేస్తాడు. రేపు విజయవాడలో మీటింగ్ లేదు అంటాడు. ఆయన రేపు అందుబాటులో ఉండటం లేదు. అందుకే విజయవాడలో రేపు మీటింగ్ లేదు అని చెబుతాడు. త్వరలోనే ఆయన హైదరాబాద్ కు వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తా అని చెప్పారు అంటాడు. దీంతో నందు మళ్లీ వెనక్కి తిరుగుతాడు.

కట్ చేస్తే రౌడీలు మెల్లగా వస్తూ ఉంటారు. అదేంటి తలుపులు తెర్చుకొని ఉన్నారు అని అనుకుంటారు. మెల్లగా లోపలికి వస్తారు. అక్కడే కూర్చొని ఉన్న తులసిని చూసి షాక్ అవుతారు. నిన్ను చూసి మాకు భయం వేస్తుంది అనుకుంటున్నావా అంటూ రౌడీలు నవ్వుతారు.

చూడటానికి ఇలా కనిపిస్తున్నామేమో.. నరరూప రాక్షసులం అంటారు. పాప ఎక్కడ ఉందో మర్యాదగా చెబుతావా? లేక దౌర్జన్యంగా లాక్కెళ్లమంటావా అంటారు. అడుగు ముందుకేస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది అంటుంది తులసి. ముందు చూపే కాదు.. వెనుక చూపు కూడా ఉండాలి. వెనక్కి చూడు అంటుంది.

తులసి తమ్ముడు, మరో ఇద్దరు వ్యక్తులు వస్తారు. కర్రలు పట్టుకొని వస్తారు. వాళ్లను చూసి రౌడీలు భయపడతారు. పాప రూమ్ లో ఉంది. తాళం వేశా. తాళం చేతులు నా దగ్గరే ఉన్నాయి. తాళం చేతులు కింద పడేస్తున్నా. దైర్యం ఉంటే తీసుకెళ్లి పాపను తీసుకెళ్లు అని చెబుతుంది. దీంతో ఆ రౌడీలు కిందికి వంగ గానే వాళ్లను చితకబాదుతారు. దీంతో అక్కడి నుంచి ఇద్దరూ పారిపోతారు. ఆ తర్వాత మామయ్య ఇక కిందికి రండి అంటుంది. దీంతో వాళ్లు కిందికి వస్తారు.

గొప్ప సాహసం చేశావమ్మా. మాకు తెలియకుండానే ఈ కాసేపట్లో ఇంత ప్లాన్ వేశావా అంటారు. అనవసరంగా పరిస్థితిని పీకల దాకా తెచ్చుకున్నావక్క అంటాడు తన తమ్ముడు. ఇంతలో నందు వస్తాడు. కట్ చేస్తే హనీని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నా అంటుంది తులసి. తప్పుగా అనుకోకండి అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...