Allu Arjun : ఈ బతుకు సుకుమార్ పెట్టిన బిక్ష.. ఏడ్చేసిన అల్లు అర్జున్ | The Telugu News

Allu Arjun : ఈ బతుకు సుకుమార్ పెట్టిన బిక్ష.. ఏడ్చేసిన అల్లు అర్జున్

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఒకే ఒక్క సినిమా పుష్పతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. చివరకు నేషనల్ అవార్డు కూడా పొందాడు. పుష్ప సినిమాలో తన నటనకు అందరూ ఫిదా అయ్యారు. అందుకే ఉత్తమ నటుడిగా అవార్డు పొందడం, ఇటీవలే రాష్ట్రపతి నుంచి అవార్డు కూడా తీసుకున్నాడు. ఢిల్లీలో అల్లు అర్జున్ ఈ అవార్డు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :22 October 2023,5:00 pm

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఒకే ఒక్క సినిమా పుష్పతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. చివరకు నేషనల్ అవార్డు కూడా పొందాడు. పుష్ప సినిమాలో తన నటనకు అందరూ ఫిదా అయ్యారు. అందుకే ఉత్తమ నటుడిగా అవార్డు పొందడం, ఇటీవలే రాష్ట్రపతి నుంచి అవార్డు కూడా తీసుకున్నాడు. ఢిల్లీలో అల్లు అర్జున్ ఈ అవార్డు తీసుకోవడంతో తెలుగు ఇండస్ట్రీ మురిసిపోయింది. అయితే.. ఇదే సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన దేవిశ్రీప్రసాద్ కు కూడా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. ఈనేపథ్యంలో అవార్డులు తీసుకున్న తర్వాత పుష్ప మూవీ యూనిట్ సెలబ్రేటింగ్ నేషనల్ అవార్డు అనే ఈవెంట్ ను ఏర్పాటు చేసింది.

ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. నా లైఫ్ లో ఒక లేవల్ కు వచ్చినప్పుడు, ఒక మైల్ స్టోన్ కు చేరినప్పుడు ఒక విషయం తెలుసుకుంటాను. అది అందరితో షేర్ చేసుకుంటాను. మనం ఏం కోరుకుంటే అది జరుగుతుంది. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే.. అది అంతా 50 శాతం మాత్రమే.. మనం ఎంత చేసినా అది 50 శాతమే. కానీ.. మన చుట్టూ ఉన్నవాళ్లంతా కూడా కోరుకుంటే.. పాజిటివ్ ప్రజలు నా వెంట ఉంటే అప్పుడే అది నెరవేరుతుంది. వాళ్లందరూ కోరుకున్నారు కాబట్టే నేషనల్ అవార్డు వచ్చింది. నాకు నేషనల్ అవార్డు రావాలని కోరిక ఉంది. కానీ.. నాకంటే సుకుమార్ కి ఎక్కువ కోరిక ఉంది. నానుంచి వచ్చింది కానీ.. ఆ అవార్డు నిజానికి ఆయనకే వచ్చింది అంటూ ఎమోషనల్ అయ్యాడు అల్లు అర్జున్.

allu arjun emotional speech at celebrating national award

   

Allu Arjun : సుకుమార్ లేకపోయినా ఉన్నట్టే

సుకుమార్ ఇప్పుడు ఇక్కడ లేరు. ఆయన ఇక్కడ లేకపోయినా ఉన్నట్టే. ఈ సందర్భంగా నేను ఒక విషయం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఒక సీన్ షూట్ చేశాం. అయిపోయింది వచ్చేశాం. సెకండ్ షెడ్యూల్ కోసం మళ్లీ మారెడుమల్లికి వెళ్లినప్పుడు మళ్లీ అదే సీన్ ను షూట్ చేశాం. ధర్డ్ షెడ్యూల్ అప్పుడు మళ్లీ అక్కడికే వెళ్దాం అన్నాడు. ఎందుకు రెండు సార్లు చేశాం కదా. మళ్లీ మూడోసారి ఎందుకు.. రిస్క్ అంటే బన్నీ ఈ సినిమా నాకు ఎంత పేరు వస్తుంది.. డైరెక్టర్ గా ఎంత పేరు వస్తుంది.. ఎంత డబ్బు వస్తది అనేది నాకు అనవసరం. ఈ సినిమా పేరు మీద నీకు ఎంత పర్ ఫార్మెన్స్ వస్తుంది.. అదొక్కటి తప్ప నాకు ఏం వద్దు అని సుకుమార్ చెప్పడంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు పర్ ఫార్మెన్స్ వస్తే వాళ్లకు ఏం వస్తది. ఇదంతా ఆయన వల్లనే జరిగింది అని బన్నీ చెప్పుకొచ్చారు.

kranthi

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...