Intinti Gruhalakshmi 24 Jan Tomorrow Episode : లాస్యను కాదని అంకిత, శృతితో ఎలా ధాన్యలక్ష్మి పూజ చేయిస్తారు అంటూ బంధువుల ఎత్తిపొడుపు.. దీంతో తులసి షాకింగ్ నిర్ణయం
Intinti Gruhalakshmi 24 Jan Tomorrow Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 24 జనవరి 2022, ఎపిసోడ్ 536 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంకిత, శృతిలకు పండుగ పనులన్నీ వాళ్లనే చేయాలని తులసి చెప్పిన విషయం తెలిసిందే. నేను లేకుండా ఏ పనులూ చేసుకోలేరా.. ఇప్పటి నుంచి ఎవ్వరి పనులు వాళ్లే చూసుకోవాలంటూ తులసి అందరి మీద సీరియస్ అవడం నందు వింటాడు. నువ్వు ఎప్పటిలాగానే పిల్లలతో ఉండు.. ఇలా వాళ్లపై చిరాకు పడకు. ఇప్పటికే వాళ్లు తండ్రికి దూరం అయ్యారు. తల్లిని కూడా దూరం చేయకు అని నందు తులసికి సలహా ఇస్తాడు. నిన్ను అందరి ముందు తిట్టినందుకు సారీ చెబుతాడు. దీంతో తులసి ఎక్కువగా నందుతో ఏం మాట్లాడదు.
మరోవైపు పండుగ సరుకుల కోసం అంకిత, శృతి లిస్టు రాస్తుంటారు. ఇద్దరూ తమకు తోచిన సరుకుల పేర్లు రాస్తారు. ఇంతలో తులసి వచ్చి ఇలా కాదు సరుకుల లిస్టు రాయడం.. ఏది గుర్తొస్తే అది రాస్తే.. తర్వాత కావాల్సిన వస్తువులను మరిచిపోతారు అని చెబుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఏం పనులు చేస్తామో అలా వరుసగా వాటి కోసం కావాల్సిన సరుకులను రాయాలి అని చెప్పి రాస్తుంది తులసి. చిట్టి రాసి ఆ సరుకులను తీసుకురావాలని అంకిత, శృతికి చెబుతుంది. దీంతో సరే ఆంటి అని చెప్పి వాళ్లు సరుకులు తేవడం కోసం బయటికి వెళ్తారు.
మరోవైపు లాస్య వచ్చి నందు ఇంట్లో అందరూ నా మీద పగబట్టారు అంటుంది. ఎందుకు ఏమైంది అంటే.. తులసి ఈసారి ఆ పూజను అంకిత, శృతితో చేయిస్తుందట. ఇన్ని రోజులు తులసి చేసింది కదా. ఇప్పుడు ఎందుకు నేను చేయొద్దు. వాళ్లు కొత్త తరం కోడళ్లు అట. నిజానికి నేను కొత్త కోడలును కదా అంటుంది లాస్య.
ఆ అవకాశం మనకు ఇవ్వాలి కానీ.. వాళ్లకు ఇవ్వడం ఏంటి అంటుంది లాస్య. మనకు కొత్తగా పెళ్లి అయి ఉండొచ్చు కానీ.. మనకు పెళ్లి కొత్త కాదు.. నువ్వు ఇంటికి కోడలుగా రాలేదు. నా కోడళ్లకు అత్తగా వచ్చావు అని సర్దిచెప్పబోతాడు నందు.
Intinti Gruhalakshmi 24 Jan Tomorrow Episode : ధాన్యలక్ష్మి పూజను ఎలాగైనా తానే చేయాలని పట్టుపట్టిన లాస్య
కానీ.. లాస్య మాత్రం వినదు. నేను నీ కోడళ్లకు అత్త స్థానంలో రాలేదు. భార్యగా తులసి స్థానంలో వచ్చాను. ముందు మీ అమ్మ గారితో ఒప్పించు. ఈ పండక్కి నేను ధాన్యలక్ష్మి పూజ చేస్తాను అని చెబుతుంది లాస్య. దీంతో ఇదే నీతో ఉన్న సమస్య అని చెబుతాడు నందు.
మరోవైపు రాములమ్మ ఇంటికి వస్తుంది. తులసి చూసి సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇంతలో అంకిత, శృతి సరుకులన్నీ తీసుకొస్తారు. మేము సరుకులు తీసుకొచ్చాం అని చూపిస్తారు. సరుకులు తేవడం మాత్రమే కాదు.. ఉదయం నుంచి రాత్రి వరకు వంటల పనులు కూడా మీరే చూసుకోవాలి అని చెబుతుంది తులసి.
అభి, ప్రేమ్, దివ్య కూడా అదే చెబుతుంది. అవును.. పండుగ రోజు మొత్తం మీరే పనులు చూసుకోవాలి అని అంకిత, శృతిని టీజ్ చేస్తారు. రేపు భోగి సందర్భంగా రేపు ఉదయం 4 గంటలకే లేవాలని చెబుతుంది తులసి. అందరూ ఉదయమే లేచి భోగి మంటలు వేసి.. ఆ తర్వాత పిండివంటలు చేస్తారు.
అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు. ఇల్లును సుందరంగా అలంకరిస్తారు. అయితే.. పండక్కి వచ్చిన అంకిత తల్లి.. లాస్యతో పూజ ఎందుకు చేయించడం లేదు అంటూ తులసిని ప్రశ్నిస్తుంది. పూర్తిగా మొగుడు లేకపోతే.. మొగుడు వదిలేస్తే పూజకు దూరం పెట్టాలి కానీ.. ఇదేంటి తప్పు కదా అని చెబుతుంది. దీంతో తులసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.