Intinti Gruhalakshmi 29 Dec Today Episode : తులసికి రక్తం ఇచ్చి కాపాడిన నందు.. ఈ విషయం తెలిసి లాస్య షాకింగ్ నిర్ణయం
Intinti Gruhalakshmi 29 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 డిసెంబర్ 2021, బుధవారం 515 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి స్పృహతప్పి పడిపోవడంతో ఉన్నపళంగా నందు తన ఫస్ట్ నైట్ ను వదిలేసి మరీ తులసిని హాస్పిటల్ కు తీసుకెళ్తాడు. దీంతో లాస్యకు పిచ్చి లేస్తుంది. ఈసమయంలో ఏం చేయాలో తనకు భాగ్య చెబుతుంది. మరోవైపు తులసికి ఏమైందో అని నందు టెన్షన్ పడుతూ ఉంటాడు. కుటుంబ సభ్యులు కూడా టెన్షన్ లో ఉంటారు. ప్రేమ్.. ఇక్కడే ఉంటే నువ్వు టెన్షన్ తట్టుకోలేవు. రిసార్ట్ కు వెళ్లు అని నందు అంటాడు. దీంతో మీ కొత్త భార్య మీకోసం వెయిట్ చేస్తుందేమో కావాలంటే మీరు వెళ్లండి అంటాడు.. ఇంతలో డాక్టర్ వస్తాడు. ఏమైంది అని అడిగితే.. తీవ్ర రక్తస్రావం అయింది. తనకు అర్జెంట్ గా రక్తం కావాలి అంటాడు డాక్టర్.
కాకపోతే ఆ రక్తం ఎక్కడా దొరకడం లేదు. చాలా రేర్ బ్లడ్ గ్రూప్ అంటాడు డాక్టర్. దీంతో నాదీ, తులసిది ఒకే బ్లడ్ గ్రూప్. ఆ రక్తం నేను ఇస్తాను అంటాడు నందు. దీంతో వెంటనే నందు రక్తం ఇస్తాడు. మరోవైపు ఏం చేయాలి అని లాస్య ప్లాన్ వేస్తుంది. నీ ఫస్ట్ నైట్ రోజు నేను నైట్ అవుట్ చేయాల్సి వస్తోంది అంటుంది భాగ్య. ఉదయం అయ్యాక రెడీ అయి నందుకు ఫోన్ చేస్తుంది లాస్య. కానీ నందు ఫోన్ లిఫ్ట్ చేయడు. దీంతో కృష్ణకు ఫోన్ చేస్తుంది. నందు ఎక్కడున్నారు అంటుంది. తులసి ఎలా ఉందని అడుగుతావని అనుకున్నాను అంటాడు. నందు బ్లడ్ డొనేట్ చేస్తున్నాడు.. అందుకే మాట్లాడటం కుదరదు అంటాడు డాక్టర్ కృష్ణ. మరోవైపు నందు రక్తం ఇవ్వడంతో తులసి ఆరోగ్య పరిస్థితి బాగుపడుతుంది. దీంతో కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉంటారు.
తులసి ఆపరేషన్ సక్సెస్ కావడంతో డాక్టర్ కు అందరూ థ్యాంక్స్ చెబుతారు. తులసికి నందు రక్తం ఎక్కిస్తారు. తనను ఇక నుంచి చాలా జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ చెబుతాడు. రక్తం ఇచ్చి వచ్చాక నందు కాస్త నీరసంగా ఉంటాడు. రిసార్ట్ కు వచ్చి సోఫాలోనే పడుకుంటాడు.
Intinti Gruhalakshmi 29 Dec Today Episode : తులసికి రక్తం ఎందుకు ఇచ్చావన్న లాస్య
ఇంతలో లాస్య వస్తుంది. తలనొప్పిగా ఉందా.. అని అడుగుతుంది. నువ్వు నా గురించి ఆలోచించకపోయినా.. నేను నీ గురించి ఆలోచించాల్సిందే.. అంటుంది. నందు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడడు. మాజీ భార్యకు ప్రేమగా రక్తదానం చేసి వచ్చావు కదా. పాపం నీరసంగా ఉండి ఉంటుంది. ఎన్ని లీటర్లు ఇచ్చావు చెప్పు నందు అని అడుగుతుంది లాస్య.
దీంతో హాస్పిటల్ కు వచ్చావా.. బ్లడ్ ఇచ్చిన విషయం నీకు ఎవరు చెప్పారు అని అడుగుతాడు నందు. డాక్టర్ ను అడిగి తెలుసుకున్నా అంటుంది. రాకుండా ఉండి మంచి పని చేశావు. వచ్చి అక్కడ రచ్చ చేస్తే నేను ఊరుకునేవాడిని కాదు.. అంటాడు నందు.
ఇక నుంచి అయినా నీ బెదిరింపులు నా ముందు చూపించకు. ప్రతి విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు అంటాడు నందు. ఇద్దరూ కలిసి కాసేపు పోట్లాడుకుంటారు. తులసి ఆరోగ్యం కుదుటపడటంతో కుటుంబ సభ్యులు అందరూ సరదాగా కాసేపు గడుపుతారు.
ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లిన నందు నేను మారిపోయాను అంటాడు. కానీ.. నువ్వే నన్ను అర్థం చేసుకోలేదు అని తులసితో అంటాడు. ఇప్పటికైనా నువ్వు కోలుకొని సంతోషంగా ఉండు అంటాడు. వీలైతే నన్ను క్షమించు.. అని తులసిని వేడుకుంటాడు. కానీ.. తులసికి అప్పుడు స్పృహ ఉండదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.