Intinti Gruhalakshmi 5 Feb Today Episode : లాస్య ప్లాన్ సక్సెస్.. అంకితను తులసిపై ఉసిగొల్పి రచ్చ రచ్చ.. మళ్లీ ముక్కలైన తులసి ఫ్యామిలీ.. ఇంతలో మరో ట్విస్ట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 5 Feb Today Episode : లాస్య ప్లాన్ సక్సెస్.. అంకితను తులసిపై ఉసిగొల్పి రచ్చ రచ్చ.. మళ్లీ ముక్కలైన తులసి ఫ్యామిలీ.. ఇంతలో మరో ట్విస్ట్

 Authored By gatla | The Telugu News | Updated on :5 February 2022,9:30 am

Intinti Gruhalakshmi 5 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 ఫిబ్రవరి 2022, శనివారం ఎపిసోడ్ 548 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేనే తప్పు చేశాను మామయ్య.. నేను తొందర పడకుండా ఉండాల్సింది అని పరందామయ్యతో అంటుంది తులసి. లేదమ్మా.. ఇందులో నీ తప్పేమీ లేదు. మీ అత్తయ్యే కొంచెం ఎక్కువగా మాట్లాడింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు పరందామయ్య. మరోవైపు ఆన్ లైన్ మీటింగ్ లో చేరేందుకు అంకిత ట్రై చేస్తుంది. కాస్త లేట్ కావడంతో ఈరోజు మీటింగ్ లోకి తనను వద్దంటారు. దీంతో చిరాకు పడుతుంది అంకిత. ఇంతలో అభి వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. దీంతో అసలు విషయం చెబుతుంది అంకిత. పదా.. వెంటనే వాళ్లను అడుగుదాం అంటాడు. దీంతో వద్దులే అంటుంది అంకిత.

intinti gruhalakshmi 5 february 2022 full episode

intinti gruhalakshmi 5 february 2022 full episode

మరోవైపు తులసి ఏడుస్తూ ఉంటుంది. నాకు తెలిసి అంకితకు నా మీద కోపం, ఉక్రోశం ఎప్పటి నుంచో ఉన్నాయి. నాకు ముందే చెప్పొచ్చు కదా అని అనసూయ, పరందామయ్యతో చెబుతుంది తులసి. అంకితను బాధపెట్టాలని కానీ.. ఏడిపించి తక్కువ చేయాలని కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు. తను తప్పు చేసినా కూడా ఏనాడూ ఎవ్వరికీ చెప్పలేదు. అలా చేస్తే మన పరువు మనం తీసుకున్నట్టే కదా అత్తయ్య. మనం గొప్పవాళ్లం అని నిరూపించుకోవడానికి ఎదుటివాళ్లను చేతగాని వాళ్లు అన్నట్టు చేసి చూపించడం కరెక్ట్ కాదు కదా అత్తయ్య అంటుంది తులసి. అంకితకు నా మీద కోపం వచ్చి నాతో మాట్లాడకపోతే నేను ఎందుకు తనకు దూరంగా ఉండాలి. నాకు తనతో ఎటువంటి సమస్య లేదు కదా.. నేను వెళ్లి మాట్లాడుతాను అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

డైరెక్ట్ గా అంకిత రూమ్ కు వెళ్లబోతుంది. ఇంతలో అంకిత అభితో మాట్లాడే విషయాలను తులసి వింటుంది. అసలు నా ప్రాబ్లమ్ తులసి ఆంటి అని అభితో చెబుతుంది అంకిత. ఈ ఇంట్లో కోడలు అంటే తులసి ఆంటి.. తులసి ఆంటిలా ఉండాలి అని అంటారు.. అని అభితో చెబుతుంది అంకిత.

ఇంతలో లాస్య వస్తుంది. లోపల ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదు కదా తులసి. చాటుగా నిలబడి.. మొగుడు, పెళ్లాల మాటలు వినడం తప్పుగా అనిపించడం లేదా తులసి. ఇదేం అలవాటు అంటుంది లాస్య. నేను వాళ్లతో మాట్లాడటానికి వచ్చాను.. వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి రాలేదు అంటుంది తులసి.

Intinti Gruhalakshmi 5 Feb Today Episode : తులసిని తన కూతురు విషయమై నిలదీసిన గాయత్రి

ఇంతలో గాయత్రి వస్తుంది. తులసిని నిలదీస్తుంది. అంకిత నా కోడలు కాదు కూతురు అన్నావు. తనకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటా అన్నావు. గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తున్నావు. నా కూతురును మహారాణిలా పెంచి ఈ ఇంటికి అప్పగించింది పనిమనిషిలా ఉండటానికి కాదు.. అంటుంది గాయత్రి.

నా కూతురుతో వంట పనులన్నీ చేయిస్తున్నారు. కోడలు ఇంట్లో అడుగు పెట్టడమే ఆలస్యం.. అత్తగారు మహారాణి అయిపోతుందా.. కోడలు నౌకరు అవుతుందా? నా కూతురుతో ఇంటి పని.. వంట పని చేయించడానికి నువ్వెవరు అని ప్రశ్నిస్తుంది గాయత్రి.

మీరు జాగ్రత్తగా మాట్లాడండి అని నందు గాయత్రిపై అరుస్తాడు. అంకిత తల్లి కాబట్టి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే సహిస్తామని అనుకోవద్దు అంటాడు నందు. ఇక్కడ ఎవ్వరూ అంకితను టార్చర్ పెట్టడం లేదు అంటాడు నందు. నా కూతురును టార్చర్ పెడుతున్నందుకు అందరినీ అరెస్ట్ చేయించగలను అంటుంది గాయత్రి.

దీంతో తులసి సీరియస్ అవుతుంది. రాములమ్మ లేదు కాబట్టే ఈరోజు అంకిత పని చేసింది అని తులసి అంటుంది. అనసూయ కూడా అదే చెబుతుంది. మొత్తం మీద అందరూ పెద్ద గొడవ పడతారు. అంకిత కూడా తన తల్లి వైపే ఉంటుంది. గాయత్రి, లాస్య కలిసి తులసి మీద సీరియస్ అవుతారు.

జరిగిందంతా మరిచిపో. ఇక నుంచి నీ హాస్పిటల్ పని మీదే దృష్టి పెట్టు. ఇంటి బాధ్యత, వంట బాధ్యత నాది అని అంకితతో తులసి చెబుతుంది. మొదటి రోజు నువ్వు ఈ ఇంట్లోకి వచ్చిన మాటను నేను నిలబెట్టుకుంటాను. తల్లిలా చెబుతున్నాను గుర్తుపెట్టుకో. ఎప్పుడూ పెద్దవాళ్లకు ఎదురు చెప్పకు అని తులసి.. అంకితతో అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది