Intinti Gruhalakshmi 8 March Today Episode : తులసికి దూరమైనా.. తులసి వండిన వంటలనే తిన్న ప్రేమ్, శృతి.. రాములమ్మ లేకపోతే ప్రేమ్, శృతి ఏమయ్యేవారో? తులసికి ఎదురుతిరిగిన దివ్య | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Intinti Gruhalakshmi 8 March Today Episode : తులసికి దూరమైనా.. తులసి వండిన వంటలనే తిన్న ప్రేమ్, శృతి.. రాములమ్మ లేకపోతే ప్రేమ్, శృతి ఏమయ్యేవారో? తులసికి ఎదురుతిరిగిన దివ్య

Intinti Gruhalakshmi 8 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 మార్చి 2022, మంగళవారం ఎపిసోడ్ 574 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందు, లాస్య తినకుండా వెళ్లేసరికి.. దివ్యకు కూడా ప్రేమ్ గుర్తొస్తాడు. దీంతో తినకుండానే అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది. అభి ఏంట్రా కలపడం ఆపేశావు అంటుంది తులసి. దీంతో ఆకలిగా లేదు మామ్ అంటాడు అభి. లేచి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. […]

 Authored By gatla | The Telugu News | Updated on :8 March 2022,9:30 am

Intinti Gruhalakshmi 8 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 మార్చి 2022, మంగళవారం ఎపిసోడ్ 574 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందు, లాస్య తినకుండా వెళ్లేసరికి.. దివ్యకు కూడా ప్రేమ్ గుర్తొస్తాడు. దీంతో తినకుండానే అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది. అభి ఏంట్రా కలపడం ఆపేశావు అంటుంది తులసి. దీంతో ఆకలిగా లేదు మామ్ అంటాడు అభి. లేచి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అంకిత కూడా తనతో పాటే వెళ్లిపోతుంది. నా కడుపులో పుట్టిన బిడ్డలకు ఈ అమ్మ మీద నమ్మకం లేకుండా పోయింది. కనీసం మీరైనా తినండి మామయ్య అంటుంది తులసి. దీంతో కడుపు నిండిపోయింది కానీ ఇక లేవండి అని చెప్పి అనసూయ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నన్ను క్షమించమ్మా నేను తినలేను అని చెప్పి పరందామయ్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

intinti gruhalakshmi 8 march 2022 full episode

intinti gruhalakshmi 8 march 2022 full episode

దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు ప్రేమ్, శృతి గుడిలో తలదాచుకుంటారు. ఈ రాత్రికి ఇక్కడే తలదాచుకుందాం. తెల్లారితే దేవుడే మనకు దారి చూపిస్తాడు అంటుంది శృతి. ఇంతలో పూజారి వాళ్లను చూసి ఎవరు మీరు. ఏ ఊరు మనది అంటాడు. దీంతో ఈ ఊరే అంటాడు. సాయంత్రం నుంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నారు.. ఏమైంది.. ఇల్లు వదిలిపెట్టి వచ్చారా అంటాడు పూజారి. ఇలా చాలామందిని చూశాం బాబు. వెళ్లండి అంటాడు. కానీ.. మాకు ఆ అదృష్టం లేదు అంటారు ప్రేమ్, శృతి. ఈ ఒక్క రాత్రికి ఈ గుడిలో ఉంటాం. ఉదయం వెళ్లిపోతాం అని అంటారు కానీ.. పూజారి ఒప్పుకోడు. గుడి మూసే వేళ అయింది. ఇక్కడ ఉండటానికి వీలు లేదు అంటాడు పూజారి.

అప్పుడే గుడిలో మొక్కుకోవడానికి రాములమ్మ వస్తుంది. ప్రేమ్, శృతిలను చూస్తుంది. వాళ్లను తనతో పాటే తన ఇంటికి తీసుకెళ్తుంది. మరోవైపు ప్రేమ్ రూమ్ కు వెళ్లి అక్కడ ఉన్న వస్తువులను చూసి ఏడుస్తుంది తులసి. మేడలో ఉండేవాళ్లను ఈ పూరి గుడిసెలోకి తీసుకొచ్చాను.. ఏమీ అనుకోకండి అమ్మ అంటుంది రాములమ్మ.

కాదు రాములమ్మ.. రోడ్డు మీద ఉన్నవాళ్లను తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చావు అంటాడు ప్రేమ్. మీ మంచి కోసం నేను చెడ్డదాన్నిగా మారాను. నాతో ఎవ్వరూ మాట్లాడటం లేదు. నా బాధ ఎవరికి చెప్పుకోను. బతకడం తెలియని నిన్ను కట్టుబట్టలతో పంపించాను. నా ఆలోచనలు అన్నీ నీ చుట్టే తిరుగుతున్నాయి.. అని అనుకుంటుంది తులసి.

మరోవైపు ప్రేమ్, శృతికి భోజనం వడ్డిస్తుంది రాములమ్మ. ఇది మీ ఇల్లే అనుకొని ఎలాంటి మొహమాటం లేకుండా తినండి అంటుంది రాములమ్మ. ఎప్పుడు తిన్నారో ఏమో తినండమ్మా అంటుంది. దీంతో ప్రేమ్, శృతి తినడం మొదలు పెడతారు.

Intinti Gruhalakshmi 8 March Today Episode : రాములమ్మ ఇంట్లో ఆశ్రయం పొందిన ప్రేమ్, శృతి

నేను అమ్మకు దూరమైనా అమ్మ ప్రేమ నాకు దూరం కాలేదు శృతి అంటాడు ప్రేమ్. నా వెన్నంటే ఉంది. నాతోనే వస్తుంది అంటాడు. అవును అమ్మ. ఇప్పుడు మీరు తింటుంది. స్వయంగా తులసమ్మ తన చేతులతో చేసిన వంటే అంటుంది రాములమ్మ.

ఒక్క ముద్దు నోట్లో పెట్టుకోగానే ప్రేమ్ బాబు గుర్తుపట్టేశారు అంటుంది రాములమ్మ. పండుగ పూట అమ్మ చేతి వంట తినలేకపోయానని.. ఇంతకుముందు దిగులుగా ఉండేది. ఇప్పుడు ఆ దిగులు తీరిపోయింది అంటాడు ప్రేమ్. మిమ్మల్ని ఇంట్లోంచి పొమ్మనడం బాధ కలిగించే పనే కానీ.. దాని వెనుక చెప్పలేని ఏదో కారణం ఉండి ఉంటుంది ప్రేమ్ బాబు అంటుంది రాములమ్మ.

అమ్మకు దూరం అయ్యాననే బాధ తప్పితే అమ్మ మీద కోపం లేదు రాములమ్మ అంటాడు ప్రేమ్. ఇది మనకు పరీక్ష లాంటిది ప్రేమ్. బంధం ఎంత దూరం అయితే అంత గట్టిపడుతుంది అంటారు. అదే జరుగుతుందేమో అంటుంది రాములమ్మ.

మరోవైపు తులసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. మీకిష్టమని ఇన్ని పిండి వంటలు చేశాను ప్రేమ్. పండగ పూట నిన్ను ఖాళీ కడుపుతో తరిమేశాను. నేను పాపపురాలిని అని అనుకుంటుంది తులసి. మరోవైపు తులసి చేసిన పిండివంటలు తింటూ ఉంటారు.

సవతి తల్లి కూడా నా అంత కఠినంగా ప్రవర్తించదు కావచ్చు. తప్పదు నాన్నా. నా మీద ధ్వేషాన్ని పెంచుకోవు కదూ. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావురా. నాకు తెలుసు.. అనుకుంటుంది తులసి.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది