Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ 7 ఉల్టా పల్టా .. ఈసారి రెండు హౌస్ లు ..
Bigg Boss 7 Telugu : బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే తెలుగులో 6 సీజన్లను పూర్తి చేసుకుంది. త్వరలోనే సీజన్ 7 మొదలుకానుంది. గత సీజన్ ఊహించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఈసారి సీజన్ 7 కొత్తగా ప్లాన్ చేశారు నిర్వాహకులు. కింగ్ నాగార్జున ఈసారి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెల మూడు నుంచి బిగ్ బాస్ మొదలు కాబోతుంది. బిగ్బాస్ సీజన్ 7 ఉల్టా పల్టా అని […]
Bigg Boss 7 Telugu : బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే తెలుగులో 6 సీజన్లను పూర్తి చేసుకుంది. త్వరలోనే సీజన్ 7 మొదలుకానుంది. గత సీజన్ ఊహించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఈసారి సీజన్ 7 కొత్తగా ప్లాన్ చేశారు నిర్వాహకులు. కింగ్ నాగార్జున ఈసారి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెల మూడు నుంచి బిగ్ బాస్ మొదలు కాబోతుంది. బిగ్బాస్ సీజన్ 7 ఉల్టా పల్టా అని అంటున్నారు. ఉల్టా ఫల్టా కాన్సెప్ట్ ఏంటా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫైనల్ గా ఈ కాన్సెప్ట్ గురించి విషయం బయటకు వచ్చింది. అయితే ప్రతిసారి ఓకే హౌస్ ఓకే షుట్ .
అయితే ఈసారి సీజన్ సెవెన్ కి అలా కాదు. రెండు హౌస్ లు ఒక షో. తాజాగా తమిళ బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. అందులో కమలహాసన్ హోస్ట్ గా డ్యూయల్ రోల్ లో సందడి చేశారు. అయితే ఒక కమలహాసన్ బిగ్ బాస్ షో గురించి చెబుతూ ఉండగా మరో కమలహాసన్ ఇప్పుడు ఇదే ఇల్లు, అంతేమంది కంటెస్టెంట్ లు, అవే ట్విస్ట్ లు అందులో కొత్తదనం ఏముంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. హోస్ట్ కమల్ హాసన్ ఈసారి ఒకటి షో రెండు హౌస్ లు అంటూ చెబుతూ అంచనాలు పెంచేశారు. అంటే ఒకటే షో అయిన వేరువేరు హౌస్ లు ఉండబోతున్నాయని క్లారిటీ ఇచ్చారు.
కంటెస్టెంట్స్ లో కొందరిని ఒక హౌస్ లో మరికొందరిని మరొక హౌస్ లో ఉంచుతూ బిగ్ బాస్ ఒక ఆట ఆడుకుంటున్నారని, అవసరమైనప్పుడు కంటెస్టెంట్ ని అటు ఇటు మారుస్తూ ఉంటారని తెలుస్తుంది. తెలుగులో కూడా ఉల్టా ఫల్టా ఇదే అని జోరుగా ప్రచారం సాగుతుంది. మరి ఇది నిజమా కాదా తెలియాలంటే సెప్టెంబర్ మూడు వరకు వేచి చూడాలి. గత సీజన్ అంతగా సక్సెస్ కాకపోవడంతో ఈసారి బిగ్ బాస్ కొత్తగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాగైనా సరే ప్రేక్షకులను ఆకట్టుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తుంది. మరి ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.