Indraja : జబర్దస్త్‌ ఇంద్రజ ఓవర్ యాక్షన్‌ కాస్త తగ్గించుకుంటే కుమ్మేయొచ్చు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Indraja : జబర్దస్త్‌ ఇంద్రజ ఓవర్ యాక్షన్‌ కాస్త తగ్గించుకుంటే కుమ్మేయొచ్చు

 Authored By prabhas | The Telugu News | Updated on :11 May 2022,10:00 am

Indraja : జబర్దస్త్‌ నుండి జడ్జ్‌ గా రోజా తప్పుకుంది. జగన్ ప్రభుత్వం లో ఆమెకు మంత్రి పదవి దక్కింది. ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో జబర్దస్త్ లో జడ్జ్‌ గా వ్యవహరించిన సమయంలోనే విమర్శలు వచ్చాయి. దాంతో ఆమె మంత్రి పదవి వచ్చిన వెంటనే జబర్దస్త్‌ కు గుడ్‌ బై చెప్పేసింది. ఆమె ఇండస్ట్రీ లో ఉన్నంత కాలం చాలా ఆనందంగా ఉన్నట్లుగా చెప్పింది. జబర్దస్త్‌ లో తాను దక్కించుకున్నది చాలా అంటూ వెళ్లి పోయింది. ఎంతో లక్కీ చైర్‌ అయిన జడ్జ్ చూర్ ఎవరికి దక్కుతుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.రోజా వెళ్లి పోవడంతో ఆ స్థానంలో ఇంద్రజ దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది.

రోజా కు ఆరోగ్యం సరిగా లేని సమయంలో దాదాపుగా రెండు నెలల పాటు రోజా స్థానంలో ఇంద్రజ వచ్చిన విషయం తెల్సిందే. ఆ సమయంలో రోజా కు సరైన ప్రత్యామ్నాయం అంటూ ఇంద్రజను అంతా అనుకున్నారు. ఆమెకు ఆ సమయంలో మంచి ఫాలోయింగ్‌ దక్కింది. ఆమె కంటిన్యూ అవ్వాలని కూడా అభిమానులు అనుకున్నారు. అందుకే ఆమె కు శ్రీదేవి డ్రామా కంపెనీ దక్కింది.ఇప్పుడు రోజా కు మంత్రి పదవి దక్కడంతో ఇంద్రజ ఫుల్ టైమ్‌ జబర్దస్త్‌ జడ్జ్‌ గా కొనసాగే అవకాశం కనిపిస్తుంది.

jabardast full time judge indraja

jabardast full time judge indraja

అయితే ఈ సమయంలో ఆమెను కాస్త అతి తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ కొందరు సూచిస్తున్నారు. ఆమె కొన్ని స్కిట్స్ లో టేబుల్‌ పై తల పెట్టి మరీ నవ్వేస్తుంది. ఇక తాజా ఎపిసోడ్‌ లో కుర్చీలో నుండి లేచి మరీ కడుపు పట్టేసుకుని నవ్వేసింది. కూర్చుని కూడా నవ్వొచ్చు కదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మీ నవ్వు బాగుంటుంది కదా అని మరీ అతిగా నవ్వితే బాగా లేదు ఇంద్రజ గారు అంటూ అభిమానులు స్వయంగా కామెంట్స్ చేస్తున్నారు. అదొక్కటి చూసుకుంటే ఇంద్రజ జబర్దస్త్‌ లో కుమ్మేయవచ్చు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది