Jabardasth rocking rakesh : కొత్త పాపతో రొమాన్స్!.. రోహిణిని పక్కన పెట్టిన రాకింగ్ రాకేష్..
Jabardasth rocking rakesh : జబర్దస్త్‌లో రాకింగ్ రాకేష్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. తొలుత పిల్లలతో స్కిట్ చేయడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న రాకేష్. పిల్లలతో డైలాగ్స్ చెప్పిస్తూ రాకేష్ చేసిన స్కిట్స్.. జనాలను మెప్పించాయి. అయితే కొంతకాలంగా రాకేష్ స్కిట్స్‌లో పిల్లలు కనిపించడం లేదు. నటి రోహిణి.. రాకేష్ స్కిట్స్‌లో కనిపించడం మొదలైంది. వీరిద్దరు ప్రధానంగా రాకేష్ స్కిట్స్ సాగిపోతున్నాయి. అయితే మధ్యలో రొమాన్స్ పీక్స్‌లోకి చేరుకుంది.

jabardasth jordar sujatha in rocking rakesh skit
ఓ దశలో స్టేజ్‌పైనే రాకేష్.. రోహిణికి ముద్దు పెట్టినట్టుగా చూపించారు. అది కాస్తా తెగ వైరల్ అయిపోయింది. అంతేకాకుండా వారి మధ్య లవ్ సింబల్స్ వేస్తూ ఏదో ఉంది అనేలా క్రియేట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉండటం.. రోహిణి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉండటంతో రాకేష్ స్కిట్స్ బాగానే సాగిపోతున్నాయి. అలా రోహిణి, రాకేష్ ట్రాక్ కూడా బాగానే వర్కవుట్ అయింది. అయితే రాకేష్ మాత్రం ఇప్పుడు రూట్ మార్చేసినట్టు కనిపిస్తోంది.
Jabardasth rocking rakesh : సుజాతతో రాకేష్ రొమాన్స్

jabardasth jordar sujatha in rocking rakesh skit
అయితే గత రెండు స్కిట్స్ నుంచి రాకేష్ టీమ్‌లో కొత్త అమ్మాయి సందడి చేస్తుంది. ఆమె మరెవరో కాదు.. న్యూస్ ప్రజెంటర్, బిగ్ బాస్ ఫేమ్ జోర్దార్ సుజాత. సుజాత స్కిట్‌లోకి వచ్చాక.. ఆమె కేంద్రంగానే స్కిట్స్ నడిపిస్తున్నారు. రాకేష్ కూడా జోష్‌గా డ్యాన్స్‌లు చేస్తున్నాడు. స్కిట్‌లో భాగంగా.. ఈ హుషార్ అంతా ఎందుకో తెలుసా అని రాకేష్ అనగానే.. రోజా అందుకుని నీ బాధ నాకు అర్థమైంది అని కామెంట్ చేస్తుంది. దీంతో సుజాత కూడా నవ్వేస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. అయితే కొత్తగా సుజాత రాగానే రాకేష్.. రోహిణిని పక్కన పెట్టాడేంటి అని కామెంట్స్ చేస్తున్నారు.
