Janaki Kalaganaledu 6 Oct Today Episode : జానకి చదువు గురించి జ్ఞానాంబకు తెలిసే రోజు వచ్చేసిందా? జ్ఞానాంబతో వైష్ణవి కాలేజీ ప్రిన్సిపల్ ఎందుకు మాట్లాడాలని చెప్పారు?
Janaki Kalaganaledu 6 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 6 అక్టోబర్, 2021, బుధవారం ఎపిసోడ్ 143 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
అసలు జానకి.. ఆ బ్రేస్ లెట్ ను ఎలా విడిపించింది. తనకు నేను ఆ బ్రేస్ లెట్ ను తాకట్ట పెట్టినట్టు తనకు ఎలా తెలుసు అని తెగ ఆలోచిస్తుంటాడు రామా. అప్పుడే జానకి అక్కడికి వచ్చి.. ఒక చిట్టీని ఇస్తుంది. ఏమండి.. మీ బ్రేస్ లెట్ ను విడిపించినట్టు కొట్టు అతను ఇచ్చిన రిసీప్ట్ అని చెబుతుంది. నిన్న మీ షర్ట్ ఉతుకుంటుంటే జేబులో ఇది దొరికింది. మీరు నాకోసం ఇంత చేస్తున్నారు కానీ.. ఈరోజు బ్రేస్ లెట్ గురించి పెద్ద గొడవే జరిగి ఉండేది.
మీరు నాకోసం పడే తపన.. మీ అమ్మగారిని బాధపెట్టేలా ఉండకూడదు అంటుంది జానకి. అవును నిజమే కానీ.. నా భార్య ఆశయం ఒక్క అడుగు ముందే ఆగిపోతుంది. అది నాకు ఇష్టం లేదు.. అని చెబుతాడు రామా.
ఏ విషయంలోనూ ఎప్పుడూ తప్పుచేయని మీరు నాకోసం బ్రేస్ లెట్ ను తాకట్టు పెట్టడం నాకు కష్టంగా ఉంది అని చెబుతుంది జానకి. మా అమ్మ నాకోసం ఇచ్చిన బ్రేస్ లెట్ ను నా భార్యకు మంచి చేయడం కోసం ఉపయోగిస్తే తప్పు లేదు అంటాడు రామా.
ఇదిగో రామచిలుకా.. మా ఆయన బుంగమూతి పెట్టడం నాకు నచ్చలేదు.. అంటుంది. పరిస్థితుల ప్రభావం ఏం చేస్తాం.. ఇంకా సమయం పడుతుంది మరి. ఇదిగో రామచిలుక.. ఈమధ్య మా ఆయన అస్సలు పట్టించుకోవడం లేదు. కనీసం నాకు.. నాకు.. అంటూ చేతులు చాపుతుంది జానకి. వెంటనే తనను హత్తుకుంటాడు రామా. ఇంతలో రామా.. అని పిలుస్తుంది జ్ఞానాంబ. దీంతో జానకిని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రామా.
Janaki Kalaganaledu 6 Oct Today Episode : రామచంద్రాపురం కాలేజీ ప్రిన్సిపల్ జ్ఞానాంబకు ఫోన్
కట్ చేస్తే జ్ఞానాంబకు ఫోన్ వస్తుంది. రామచంద్రాపురం వైష్ణవి కాలేజీ ప్రిన్సిపల్ మూర్తి కాల్ చేస్తాడు. మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని అంటాడు. ఫోన్ లో మాట్లాడే విషయం కాదు. మీకు ఎప్పుడు వీలు కుదురుతుందో చెబితే మీ ఊరు వచ్చి మాట్లాడుతాను.. అంటాడు. దీంతో రేపు నాకు రామచంద్రాపురం వచ్చే పని ఉంది. నేను రేపు వచ్చి మాట్లాడుతాను.. అంటుంది జ్ఞానాంబ. సరే.. అమ్మ అంటాడు. ప్రిన్సిపల్ గారు అంత ముఖ్యమైన విషయం ఏం మాట్లాడుతారు.. అని అనుకుంటుంది జ్ఞానాంబ.
కట్ చేస్తే.. జానకి నిద్రపోతూ ఉంటుంది. అర్ధరాత్రి పూట జానకిని నిద్రలేపుతాడు రామా. మీతో ఒక ముఖ్యమైన పని ఉందండి.. అంటాడు రామా. పదండి.. చూపిస్తాను అంటాడు. తనను ఒకచోటుకు తీసుకెళ్తాడు రామా. తన పుట్టిన రోజు కాబట్టి డెకరేషన్ చేసి కేక్ తీసుకొచ్చి అక్కడ పెడతాడు. అక్కడికి తీసుకెళ్లి జానకిని సర్ ప్రైజ్ చేస్తాడు రామా. కేక్ కట్ చేసి.. ఇద్దరూ తన పుట్టిన రోజు సంబురాలను జరుపుకుంటారు.
ఉదయమే జానకి నిద్ర లేవగానే తన తలుపుల ముందు అందరూ వచ్చి నిలబడతారు. అత్తయ్య గారు ఏమైందండి అంటుంది జానకి. అందరూ సీరియస్ గా తన వైపు చూస్తారు. దీంతో నీకోసమే అంటుంది జ్ఞానాంబ. ఈ విషయాన్ని నువ్వు మా దగ్గర ఎందుకు దాచావు.. అని అడుగుతుంది జ్ఞానాంబ.
మరోవైపు జ్ఞానాంబ.. రామచంద్రాపురంలోని కాలేజీకి వెళ్తుంది. అక్కడ ప్రిన్సిపల్ ను కలవడం కోసం వెళ్తుంది. అక్కడ బోర్డు మీద ఉన్న జానకి ఫోటోను జ్ఞానాంబ చూస్తుందా? జానకి చదువు విషయం తెలుసుకుంటుందా? తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.