Kalki Movie : అయ్యయ్యో పాన్ ఇండియా సినిమాలకు కల్కి డేంజర్ బెల్స్.. పుష్ప 2, దేవర ఏడుపు ఒక్కటే తక్కువ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kalki Movie : అయ్యయ్యో పాన్ ఇండియా సినిమాలకు కల్కి డేంజర్ బెల్స్.. పుష్ప 2, దేవర ఏడుపు ఒక్కటే తక్కువ..!

 Authored By ramu | The Telugu News | Updated on :2 July 2024,9:00 am

Kalki Movie : ప్రభాస్ నటించిన కల్కి సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆదివారం వరకు నాలుగు రోజుల్లో 500 కోట్ల తో మరోసారి రెబల్ స్టార్ బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసింది. కల్కి సినిమా రిలీజ్ ముందు వరకు పెద్దగా బజ్ లేదు. నాగ్ అశ్విన్ సినిమాను సరిగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. కానీ కలి చూసిన ప్రతి ఆడియన్ ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఫీల్ అవుతున్నాడు.

ఐతే కల్కితో మరోసారి తెలుగు సినిమా స్టామినా ఏంటన్నది రుజువైంది. ఇదిలాఉంటే ప్రభాస్ కల్కి హిట్ అవ్వడం ఓకే కానీ ఈ ఇయర్ రాబోతున్న మిగతా సినిమాలను రిస్క్ లో పడేసినట్టు చెప్పుకుంటున్నారు. అదెలా అంటే కల్కి వైబ్ చూస్తే ఇది అప్పుడప్పుడే తగ్గేలా లేదు. ఐతే ఈ వైబ్ లో మిగతా పాన్ ఇండియా సినిమాలకు రిస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రాబోతున్న సినిమాలు ప్రభాస్ కల్కి రేంజ్ కి మ్యాచ్ అవ్వాలి లేదంటే మాత్రం ఆడియన్స్ ఆడుకుంటారు.

Kalki Movie అయ్యయ్యో పాన్ ఇండియా సినిమాలకు కల్కి డేంజర్ బెల్స్ పుష్ప 2 దేవర ఏడుపు ఒక్కటే తక్కువ

Kalki Movie : అయ్యయ్యో పాన్ ఇండియా సినిమాలకు కల్కి డేంజర్ బెల్స్.. పుష్ప 2, దేవర ఏడుపు ఒక్కటే తక్కువ..!

Kalki Movie కల్కి వల్ల ఆ సినిమాల మీద ప్రెజర్

కల్కి తర్వాత భారతీయుడు 2 వస్తుంది. ఆ సినిమాకు అంత బజ్ లేదు. ఇక సెప్టెంబర్ 27న దేవర వస్తుంది. డిసెంబర్ 6న పుష్ప 2 లైన్ లో ఉంది. ఈ సినిమాలన్నీ భారీ అంచనాలతో పాన్ ఇండియా రిలీజ్ అవుతున్నాయి. ఐతే వీటికి ముందు కల్కి పెట్టిన టార్గెట్స్ రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అలా కావాలంటే ఆ సినిమాలు కల్కిని మించి ఉండాలి. మరి కల్కిని మించే కథ కథనాలు సెట్ అవుతాయా లేదా అన్నది చూడాలి. కల్కి చూసిన హిందీ ఆడియన్స్ దాన్ని మించి ఉంటేనే మరో సూపర్ హిట్ అందిస్తారు. పుష్ప 2, గేం చేంజర్, దేవర ఇలా అన్ని సినిమాలు ఈ ఇయర్ కి రిలీజ్ ఉన్నాయి. వీటిలో కల్కిని మించే సినిమా ఏదవుతుందో
చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది