Kalpika Ganesh : పబ్‌లో గొడవ.. అసలు ఇదంతా ఎందుకు చేసిందో చెప్పి విమర్శలపాలైందిగా..!
ప్రధానాంశాలు:
Kalpika Ganesh : పబ్‌లో గొడవ.. అసలు ఇదంతా ఎందుకు చేసిందో చెప్పి విమర్శలపాలైందిగా..!
Kalpika Ganesh : సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి నటి కల్పిక సుపరిచితమే. రెగ్యులర్ గా తన ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే ఇప్పుడు ఓ వివాదం కారణంగా కల్పిక వార్తల్లో నిలిచింది. ఇటీవల కల్పిక హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ కు వెళ్లగా.. అక్కడ నిర్వాహకులతో ఆమెకు గొడవ జరిగింది. తన పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌కి వెళ్లింది. తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంది.
Kalpika Ganesh : పబ్‌లో గొడవ.. అసలు ఇదంతా ఎందుకు చేసిందో చెప్పి విమర్శలపాలైందిగా..!
Kalpika Ganesh పబ్లిసిటీ కోసమేనా ?
స్పెషల్‌గా ఇచ్చే కాంప్లిమెంటరీ కేక్ విషయంలో ప్రిజం పబ్ సిబ్బందికి, కల్పికకి మధ్య గొడవ జరిగింది. మాట మాట పెరిగి పెద్ద రచ్చ అయ్యింది. దీంతో తనపై పబ్ సిబ్బంది దాడి చేశారని, తనని డ్రగ్ అడిక్ట్ అంటూ దూషించారని ఆమె ఆరోపించింది.అయితే ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు కూడా తనని అవమానించారని కల్పిక ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆసక్తికర విషయాలు గమనించారు.
ఇందులో కల్పిక చేసిన రచ్చే ఎక్కువగా ఉంది. ఆమెనే ప్లేట్స్ విసిరేయడం, అక్కడి వస్తువులను పగలగొట్టడం కనిపించింది. అంతేకాదు పబ్ సిబ్బందిని దూషించినట్టుగా కూడా ఉంది. తీయండి తీయండి, ఫుల్‌గా తీయండి, అన్ని యాంగిల్స్ లో తీయండి అంటూ ఫైర్ అయ్యింది. మీకు కావాల్సింది అదే కదా మేడం అని సిబ్బంది అనగా, నాకు కావాల్సిందే అదే, నాకు కాంట్రవర్సీ కావాల్రా నాయనా అంటూ రెచ్చిపోయింది కల్పిక. ఈ క్రమంలో పోలీసులతోనూ వాగ్వాదానికి దిగింది. ఈ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, సబ్ స్క్రైబర్ల కోసమే ఇదంతా చేసినట్టు కల్పిక చెప్పడం గమనార్హం. మొత్తంగా కల్పిక తనకు కావాల్సిన పబ్లిసిటీని తెచ్చుకుంది.