Kalpika Ganesh : రిసార్ట్‌లో మేనేజర్‌పై బూతుల వర్షం.. మరోసారి నానా హంగామా చేసిన కల్పిక
ప్రధానాంశాలు:
Kalpika Ganesh : రిసార్ట్‌లో మేనేజర్‌పై బూతుల వర్షం.. మరోసారి నానా హంగామా చేసిన కల్పిక
Kalpika Ganesh : హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ -కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్టులో కల్పిక నానా హంగామా సృష్టించింది. అక్కడి సిబ్బందిని బూతులు తిడుతూ రచ్చ రచ్చ చేసింది. మేనేజర్ కృష్ణపై దూర్బాషలు ఆడుతూ రెచ్చిపోయింది. మెనూ కార్డు విసిరేసి, రూమ్ తాళాలు మేనేజర్‌పై మొహం కొట్టి బూతులు తిట్టడంతో అక్కడున్న వారంతా నోరెళ్లబెట్టారు.

Kalpika Ganesh : రిసార్ట్‌లో మేనేజర్‌పై బూతుల వర్షం.. మరోసారి నానా హంగామా చేసిన కల్పిక
Kalpika Ganesh : మరోసారి నానా హంగామా చేసిన కల్పిక
ఈ ఘటనపై కల్పిక స్పందిస్తూ తన వివరణ ఇచ్చింది. రిసార్టులోని సిబ్బంది తనను అవసరంగా టార్గెట్ చేశారని, తనపట్ల దురుసుగా ప్రవర్తించారని తెలిపింది. అక్కడ క్యాబ్ సదుపాయం లేదని, వైఫై పనిచేయడం లేని, సిగరెట్ తీసుకురమ్మన్నా సిబ్బంది పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. అక్కడికి తాను కస్టమర్‌గా వెళ్తే కనీస మర్యాద, స్పందన లేకపోవడం తనను బాధించిందని, అందుకే వారిని బూతులు తిట్టాల్సి వచ్చిందని తెలిపింది.
తాను చెప్పింది అక్కడి సిబ్బంది తప్పుగా అర్ధం చేసుకోవడం వల్లే ఈ రాద్దాంతం జరిగిందని వెల్లడించింది. ఒక కేసులో ఇరుక్కుని డిప్రెషన్‌లో ఉంటూ రిలాక్స్ అవ్వడానికి అక్కడికి వెళ్తే అక్కడ కూడా మనశ్శాంతి కరువైందని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో అక్కడికి వెళ్లలేదని స్పష్టం చేసింది. రిసార్ట్ సిబ్బందితో తాను మాట్లాడుతున్న వీడియోలను కల్పిక తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు ఆమెనే తప్పుబడుతున్నారు. నీకేదో ప్రాబ్లమ్ ఉన్నట్లుగా ఉంది.. ఒక్కసారి చూపించుకో, ఈ ఆంటీకి అందరికీ తిట్లు తినడం తప్ప వేరే ఏమీ తెలియదు అనుకుంటా, ప్రచారం కోసమే ఇలాంటివి చేస్తుందనుకుంటా అంటూ ట్రోల్ చేస్తున్నారు.