Kalpika Ganesh Father : నా కూతురికి మెంటల్ డిజార్డర్ సమస్య ఉంది.. ఆమె పెద్ద ప్రమాదమే అంటూ కల్పిక తండ్రి ఫిర్యాదు
ప్రధానాంశాలు:
Kalpika Ganesh Father : నా కూతురికి మెంటల్ డిజార్డర్ సమస్య ఉంది.. ఆమె పెద్ద ప్రమాదమే అంటూ కల్పిక తండ్రి ఫిర్యాదు
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు. తన కూతురు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతోందని, ఆమె నుంచి కుటుంబ సభ్యులు, సమాజానికి ప్రమాదం ఉండే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులకు ఆయన లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. తన కూతురికి మెంటల్ డిజార్డర్ ఉన్న విషయాన్ని స్పష్టంగా పేర్కొన్న గణేష్, ఇప్పటికే ఆమె రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది.

Kalpika Ganesh Father : నా కూతురికి మెంటల్ డిజార్డర్ సమస్య ఉంది.. ఆమె పెద్ద ప్రమాదమే అంటూ కల్పిక తండ్రి ఫిర్యాదు
Kalpika Ganesh Father : ఆ సమస్య ఉంది..
ఆ సమయంలో మేము ఆమెను రిహాబిలిటేషన్ సెంటర్‌కి పంపించాము. కానీ గత రెండేళ్లుగా మెడికేషన్ తీసుకోవడం ఆపేసింది. దాంతో ఆమె మళ్లీ డిప్రెషన్‌కు లోనై తరచూ గొడవలు చేస్తోంది, న్యూసెన్స్ సృష్టిస్తోంది” అని తెలిపారు.నా కూతురు వల్ల కుటుంబ సభ్యులపై ఒత్తిడి పెరిగింది. మానసికంగా తీవ్రంగా బాధపడుతున్నారు. ఆమె మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకుని మళ్లీ రిహాబిలిటేషన్ సెంటర్‌కి తరలించేందుకు అధికారుల సహకారం కావాలి అంటూ గణేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనతో మళ్లీ మానసిక ఆరోగ్యంపై సమాజంలో అవగాహన అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఇటువంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉందని, సమయానికి చికిత్స తీసుకోవడం ఎంతో అవసరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పోలీసుల విచారణ తరువాత కల్పికను మళ్లీ మానసిక ఆరోగ్య సేవల కేంద్రానికి తరలించే చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. కాగా ఇటీవల కాలంలో ఓ సారి పబ్‌లో రచ్చ చేసిన కల్పిక ఆ తర్వాత రిసార్ట్‌లో నానా హంగామా చేసింది.